CM Ys Jagan : 2024లో అధికారమే లక్ష్యంగా సీఎం జగన్.. క్లీన్‌స్వీప్ చేయాల్సిందే ..!

CM Ys Jagan : 2024లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.

CM Ys Jagan : 2024లో అధికారమే లక్ష్యంగా సీఎం జగన్.. క్లీన్‌స్వీప్ చేయాల్సిందే ..!

Ys Jagan Target 2024

CM Ys Jagan : 2024లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి. ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉన్నా… ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కోఆర్డినేటర్లతో కీలక సమావేశం నిర్వహించిన జగన్‌… వారికి టార్గెట్స్‌ ఫిక్స్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లను క్లీన్‌స్విప్ చేయాలని స్పష్టం చేశారు.

గత ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించామన్న ముఖ్యమంత్రి… ఈసారి కూడా దానికి తగ్గకుండా గెలవాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కుప్పంలో.. మున్సిపాలిటీ, స్థానిక సంస్థలలో భారీ విజయం సాధించామని… అలాంటిది ఇప్పుడు ఎందుకు గెలవలేమని పార్టీశ్రేణులను ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేయని విధంగా ఏపీని అభివృద్ధి చేశామన్న సీఎం జగన్…. సంక్షేమ కార్యక్రమాలను గడపగడప వెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు.

Ys Jagan Target 2024 (1)

Ys Jagan Target 2024

సీఎంగా, పార్టీ అధ్యక్షుడిగా తన గ్రాఫ్‌ 65 శాతం ఉందని, ఎమ్మెల్యేల్లో చాలా మందికి 40 నుంచి 45 శాతమే గ్రాఫ్‌ ఉందని, ఎన్నికల నాటికి అందరి గ్రాఫ్‌ పెరగకపోతే మార్పులు తప్పవన్నారు జగన్‌. గెలిచే వారికే టిక్కెట్లు ఇస్తామని కుండబద్దలు కొట్టారు జగన్‌. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో ప్రతీ ఇంటికి ఎంత ప్రయోజనం కలుగుతుందో తెలుసుకునేలా కార్యాచరణ రూపొందించారు.

మంత్రులు, రీజనల్ కోఆర్డినేటర్లు నెలలో పది సచివాలయాల్లో తిరగాలని.. రెండు రోజులు అక్కడే ఉండాలని జగన్ ఆదేశించారు. మే 10 నుంచి పార్టీ కార్యక్రమాలు ప్రారంభం చేయాలన్నారు ముఖ్యమంత్రి. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకువెళ్లాలని.. దీని ద్వారా ఎమ్మెల్యే గ్రాఫ్‌ కచ్చితంగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also : CM Ys Jagan : మంత్రి పదవులకు వస్తాయనుకున్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు CM జగన్ ఎందుకు షాక్ ఇచ్చారు?!