Pawan Kalyan : ఏపీలో కోవిడ్ పరీక్ష కేంద్రాలు పెంచాలి : పవన్ కళ్యాణ్

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరమన్నారు. ఆయన త్వరగా కోలుకుని ప్రజల కోసం ఎప్పటిలాగే పని చేయాలని కోరుకుంటున్నానని చెప్పారు.

Pawan Kalyan : ఏపీలో కోవిడ్ పరీక్ష కేంద్రాలు పెంచాలి : పవన్ కళ్యాణ్

Pawan Kalyan

covid test centers increased : దేశంలో, తెలుగు రాష్ట్రాలలో నమోదవుతున్న కోవిడ్ రోగుల గణాంకాలు ఆందోళనకరంగానే వున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలకు ప్రత్యక్షంగా సేవలు అందించే ఆరోగ్య సిబ్బంది ముఖ్యంగా డాక్టర్లు, వైద్య సహాయకులు, వైద్య విద్యార్థులతోపాటు పోలీసులు, స్థానిక సంస్థల సిబ్బంది, మీడియా ఉద్యోగులు అధిక సంఖ్యలో కోవిడ్ బారినపడుతున్నారని వస్తున్న వార్తలు విచారం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, రాజకీయవేత్తలు కూడా కోవిడ్ బారిన పడుతుండడం దీని తీవ్రతను తెలియచేస్తోందన్నారు.

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరమన్నారు. ఆయన త్వరగా కోలుకుని ప్రజల కోసం ఎప్పటిలాగే పని చేయాలని కోరుకుంటున్నానని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులలో తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాలు మరింత అప్రమత్తతతో కోవిడ్ నివారణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కోవిడ్ పరీక్షలు పెంచడం ద్వారా వైరస్ సోకినవారిని గుర్తించి వైద్యం చేసే అవకాశం కలుగుతుందన్నారు.

Inspections Clubs : గ్రేటర్ హైదరాబాద్‌లోని 11 క్లబ్బుల్లో ఫైర్ సిబ్బంది తనిఖీలు

ఇందుకోసం పరీక్ష కేంద్రాలు పెంచాలని సూచించారు. మొబైల్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందని చెప్పారు. అలాగే కరోనా మొదటి వేవ్ సమయంలో పాటించిన ట్రాక్ అండ్ ట్రేస్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాత్రి వేళ కర్ఫ్యూ, సమావేశాలు, వేడుకలపై పాక్షిక నిషేధాలు ఉన్నప్పటికీ పాఠశాలల్లో తరగతుల కొనసాగింపు ప్రస్తుత తరుణంలో వాంఛనీయం కాదని అభిప్రాయపడ్డారు.

కోవిడ్ ఉధృతి తగ్గే వరకు తరగతులను వాయిదా వేయవలసిందిగా కోరుతున్నట్లు పేర్కొన్నారు. పిల్లలకు వాక్సినేషన్ పూర్తికాకపోవడం, వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వంటి అంశాలు దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవలసిందిగా వైసీపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్లిష్ట తరుణంలో మద్యం దుకాణాలను మరో గంటపాటు అదనంగా తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత వైఖరిని వెల్లడిస్తోందన్నారు.

Telangana High Court: ప్రభుత్వ శాఖల్లో కొందరు ఉద్యోగులకు పోస్టింగులు ఇవ్వకపోవడంపై హైకోర్టు విచారణ

ఈ సమయంలో ప్రజలకు నిత్యావసరాలు ఎలా ఇవ్వాలి.. వైద్య సేవలు మెరుగుపరిచేందుకు కార్యాచరణ ప్రకటించాలన్నారు. అవి లేకుండా మద్యం అమ్మకాలపై దృష్టి పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. మాస్క్ లేకుండా దయచేసి బయటకు రాకండి. భౌతిక దూరం పాటించాలని సూచించారు. వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నవారు, పిల్లల విషయంలో అప్రమత్తత పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.