Cyclone Asani Weakens : బలహీనపడిన అసని తుపాను.. భారీ నుండి అతి భారీ వర్ష సూచన | Cyclone Asani Weakens, Heavy Rain Alert

Cyclone Asani Weakens : బలహీనపడిన అసని తుపాను.. భారీ నుండి అతి భారీ వర్ష సూచన

అసని తుపాను బలహీనపడింది. తీవ్ర వాయుగుండంగా మారింది. ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Cyclone Asani Weakens : బలహీనపడిన అసని తుపాను.. భారీ నుండి అతి భారీ వర్ష సూచన

Cyclone Asani Weakens : అసని తుపాను బలహీనపడింది. తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం మచిలీపట్నంకు 20 కిలోమీటర్ల, నర్సాపూర్ కు 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.

తీవ్ర వాయుగుండంగా మారిన తుపాను మచిలీపట్నం-నర్సాపూర్ మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 65 నుండి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అసని తుపాను వాతావరణ శాఖ అధికారుల అంచనాలు తల్లకిందులు చేసింది. అసాధారణంగా పయనిస్తూ మచిలీపట్నం-నర్సాపూర్ మధ్య తీరం దాటనుంది.

CM Jagan : అసాని తుపానుపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష

అసని తుపాను నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 24 గంటలు అందుబాటులో ఉండేలా హెల్ప్‌ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. అత్యవసర సహాయం కోసం 1070, 18004250101 నెంబర్లకు కాల్ చేయాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. కాకినాడకు ఎగువన ఉన్న పోస్టులలో ఏడో నెంబరు ప్రమాద హెచ్చరిక, దిగువన ఉన్న పోస్టులలో ఐదో నెంబరు ప్రమాద హెచ్చరిక జారి చేసినట్లు చెప్పారు. కాగా, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Cyclone Asani : ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం-తానేటి వనిత

అసాని తుపానుపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. తుపాను నేపథ్యంలో హై అలర్ట్ గా ఉండాలన్నారు. ఇప్పటికే నిధులు ఇచ్చామని తెలిపారు. తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తత అవసరం అన్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

×