Daggubati Venkateswara Rao : దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గుండెపోటు..పరామర్శించిన చంద్రబాబు

జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌రరావును ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు ప‌రామ‌ర్శించారు.

Daggubati Venkateswara Rao : దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గుండెపోటు..పరామర్శించిన చంద్రబాబు

Daggubati

Updated On : June 21, 2022 / 10:23 PM IST

Daggubati Venkateswara Rao : కేంద్ర మాజీమంత్రి పురంధేశ్వ‌రి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గుండెపోటు వచ్చింది. మంగళవారం ఉదయం ఆయనకు గుండె నొప్పిరావడంతో కుటుంబ స‌భ్యులు జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయ‌న‌కు తీవ్ర‌మైన గుండెపోటు రావ‌డంతో వైద్యులు అంజియోగ్రామ్ చేసి బ్లాక్స్ ఉంటే స్టంట్ వేశారు. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌రరావును ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు ప‌రామ‌ర్శించారు. మంగ‌ళ‌వారం రాత్రి 7:40 గంట‌ల‌కు అపోలో ఆస్పత్రికి వెళ్లిన చంద్ర‌బాబు.. ద‌గ్గుబాటి ఆరోగ్య వివ‌రాల‌ను వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు దగ్గుబాటికి తోడల్లుడు అవుతారు.