‘కడక్‌నాథ్’ చికెన్ వెరీ వెరీ స్పెషల్..కిలో రూ.1200..!

‘కడక్‌నాథ్’ చికెన్ వెరీ వెరీ స్పెషల్..కిలో రూ.1200..!

Kadaknath Chicken very speacial : బ్రాయిలక్ కోడి కంటే నాటు కోడి మాంసానికి డిమాండ్ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. కానీ ఇప్పుడు కోళ్ల ఫారంల్లో పలు రకాల నాటుకోళ్లు ఉంటున్నాయి. వీటిలో పక్కా నాటుకోడి మాంసానికి డిమాండ్ కాస్త ఎక్కువే ఉంటుంది. కానీ దానికంటే ఎక్కువ డిమాండ్ ఉండే చికెన్ గురించి తెలుసా? ఒక ప్రత్యేక జాతి కోడి మార్కెట్లో ప్రవేశించి మార్కెట్ లో హవా చేస్తోంది.

అదే ‘కడక్‌నాథ్‌ కోడి’. ఈ కోడి మాంసానికి డిమాండ్ మామూలుగా ఉండదు. సాధారణంగా ఎవరికన్నా బలుబు చేస్తే ‘మాంచి నల్లకోడి మాంసం’తినాలిరా అప్పుడుగానీ ఈ జలుబు తగ్గదు అంటారు. అదిగో ‘కడక్‌నాథ్‌ కోళ్లు’ అలాగే ఉంటాయి. నల్లటి నలుపు రంగులో ఉంటాయి ‘కడక్‌నాథ్‌ కోళ్లు’. ఈ కోడి మాంసానికి మంచి డిమాండ్ఉంది. కిలో అక్షరాలా రూ.1200లు..!

 

‘కడక్‌నాథ్‌ కోడి’ మాంసం మార్కెట్ లో కిలో వెయ్యి నుంచి 12వందల రూపాయల వరకూ ఉంటుంది. అమ్మో అంత ఖరీదా?…మటన్ ఖరీదుని మించిపోయిందే..ఏంటో అంత స్పెషాలిటీ అనుకుంటున్నారు కదూ..ఈ కోడి పేరే కాదు..రూపం దగ్గర్నుంచి అన్నీ స్పెషలేనట..! అందుకే హైదరాబాదులో మాంసం మార్కెట్ లో కడక్ నాథ్ చికెన్‌ కిలో 1000 నుంచి రూ 1200 వరకు పలుకుతోంది.

కడక్‌నాథ్ కోడి మాంసం నల్లటి రంగులో నిగనిగలాడుతుంటుంది. కడక్‌నాథ్ చికెన్ ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు.ఈ చికెన్ లో కొవ్వు పదార్ధం అతి తక్కువగా ఉంటుంది. మాంచి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉండటంతో కడక్‌నాథ్ చికెన్‌ ధరీ భారీగా పలుకుతోంది. దీనికోసం వెయ్యి రూపాయలు కూడా ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదు మాంసాహార ప్రియులు.

సాధారణంగా కడక్‌నాథ్ బ్రీడ్ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్‌లలోని గిరిజన ప్రాంతాల్లో దొరుకుతుంది.ఈ కోడి మొత్తం నలుపురంగులోనే ఉంటుంది. దీని గుడ్లు కూడా నల్లగా ఉంటాయనే అంటారు కానీ కాస్త ముదురు కాఫీరంగుతో పాటు కొంత పింక్ కలర్‌లో ఉంటాయి. కడక్‌నాథ్ కోళ్లను మాంసం కోసం గుడ్లు కోసమే పెంచుతారు. ఈ కడక్ నాథ్ కోళ్లు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా ఫేమస్ అయ్యాయి కూడా..మరి ధర కాస్త ఎక్కువే అయినా ఓ సారి టేస్ట్ చూడండీ..