Vizag : ఉక్కుపోరాటం, వెనక్కి తగ్గని కేంద్రం..అడ్డుకుంటామంటున్న కమిటీ

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వంద శాతం అమ్మేస్తామని కేంద్రం మరోసారి స్పష్టం చేయడంతో.. కార్మికులు ఆందోళనకు సిద్ధమయ్యారు. 2021, జూలై 29వ తేదీ గురువారం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్‌ను ముట్టడించేందుకు ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపునిచ్చింది.

Vizag : ఉక్కుపోరాటం, వెనక్కి తగ్గని కేంద్రం..అడ్డుకుంటామంటున్న కమిటీ

Vizag

Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వంద శాతం అమ్మేస్తామని కేంద్రం మరోసారి స్పష్టం చేయడంతో.. కార్మికులు ఆందోళనకు సిద్ధమయ్యారు. 2021, జూలై 29వ తేదీ గురువారం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్‌ను ముట్టడించేందుకు ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపునిచ్చింది. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాడాల్సిన సమయం వచ్చిందని.. అడ్మిన్‌ బిల్డింగ్‌ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చింది.

Read More : Tokyo : ఒలింపిక్స్‌‌లో భారత్ పాల్గొనే మ్యాచ్‌‌ల వివరాలు

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఓవైపు కార్మికుల ఆందోళనలు జోరుగా సాగుతున్నాయి. అటు పార్టీలు కూడా ఉద్యమానికి మద్దతిస్తున్నాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు కూడా చూపించింది. అయితే… విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంలో కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో.. రాష్ట్రంలో మిగిలి ఉన్న ఒకేఒక భారీ పరిశ్రమను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ నర్సింగరావు.

Read More :Hyderabad : ఫ్రాంక్ బెడిసి కొట్టింది..యాంకర్‌‌ను చితకబాదిన షాప్ యజమాని

మరోవైపు.. ఆగస్టు 2, 3 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమానికి కార్మికులు, ఉద్యోగులు భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ అడ్డుకుని తీరతామని ప్రతిజ్ఞ చేసుకుని పోరాటంలో ముందుకు సాగాలన్నారు నర్సింగరావు.