Tokyo : ఒలింపిక్స్‌‌లో భారత్ పాల్గొనే మ్యాచ్‌‌ల వివరాలు

ఒలింపిక్స్ క్రీడలు కొనసాగుతున్నాయి. భారత్ ఒకే ఒక్క రజత పతకం సాధించి 43వ స్థానంలో కొనసాగుతోంది. జపాన్ 13 స్వర్ణాలు, 4 రజతాలు, 5 కాంస్య పతకాలతో మొదటి స్థానంలో దూసుకపోతోంది. రెండో ఒలింపిక్స్ పతకం దిశగా సాగుతున్న భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ మరో పరీక్షకు సిద్ధమైంది. మహిళల 51 కేజీల ప్రి క్వార్టర్ లో కొలంబియా బాక్సర్ వాలెన్సియాతో ఆమె తలపడనున్నారు.

Tokyo : ఒలింపిక్స్‌‌లో భారత్ పాల్గొనే మ్యాచ్‌‌ల వివరాలు

Tokyo

Tokyo Olympics 2020 India : ఒలింపిక్స్ క్రీడలు కొనసాగుతున్నాయి. భారత్ ఒకే ఒక్క రజత పతకం సాధించి 43వ స్థానంలో కొనసాగుతోంది. జపాన్ 13 స్వర్ణాలు, 4 రజతాలు, 5 కాంస్య పతకాలతో మొదటి స్థానంలో దూసుకపోతోంది. రెండో ఒలింపిక్స్ పతకం దిశగా సాగుతున్న భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ మరో పరీక్షకు సిద్ధమైంది. మహిళల 51 కేజీల ప్రి క్వార్టర్ లో కొలంబియా బాక్సర్ వాలెన్సియాతో ఆమె తలపడనున్నారు. ఇదిలా ఉంటే..భారత క్రీడాకారులు 2021, జూలై 29వ తేదీ గురువారం నాడు జరిగే పలు పోటీల్లో పాల్గొననున్నారు.

Read More : Hyderabad : ఫ్రాంక్ బెడిసి కొట్టింది..యాంకర్‌‌ను చితకబాదిన షాప్ యజమాని

హాకీ : పురుషుల పూల్ – ఏ (భారత్ – అర్జెంటినా) ఉదయం 6 గంటల నుంచి.
ఆర్చరీ : పురుషుల వ్యక్తిగత విభాగం (అతాను దాస్) ఉదయం 7.31గంటల నుంచి.
బాక్సింగ్ : పురుషుల 91 కేజీల పైన (సతీశ్ కుమార్) ఉదయం 8.48గంటల నుంచి. మహిళల 51 కేజీలు (మేరీకోమ్) మధ్యాహ్నం 3.36గంటల నుంచి.

Read More :Tokyo Olympics Slaps : షాకింగ్.. అంతా చూస్తుండగానే, మహిళా అథ్లెట్ చెంప పగలగొట్టిన కోచ్

సెయిలింగ్ : పురుషుల లేజర్ (విష్ణు) ఉదయం 8.35 గంటల నుంచి, పురుషుల స్కిప్ 49 ఈఆర్ (గణపతి – వరుణ్) ఉదయం 8.35 గంటల నుంచి. మహిళల లేజర్ రేడియల్ (నేత్ర) ఉదయం 8.45 గంటల నుంచి.
రోయింగ్ : లైట్ వెయిట్ పురుషుల డబుల్స్ స్కల్స్ (అర్జున్ – అర్వింద్) ఫైనల్ బి. ఉదయం 5.20గంటల నుంచి
గోల్ప్ : పురుషుల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే (అనిర్బన్, లాహిరి, ఉదయన్ మానె) ఉదయం 8.52 గంటల నుంచి.

Read More : Star Sapphire Cluster : అదృష్టవంతుడు.. ఇంటి పెరట్లో బావి తవ్వుతుండగా రూ.745కోట్ల విలువైన రత్నాల రాయి దొరికింది

స్విమ్మింగ్ : పురుషుల 100 మీటర్లు. బటర్ ఫ్లై (సాజన్ ప్రకాష్).
షూటింగ్ : మహిళల 25 మీ. పిస్టల్ (రహి సర్నోబత్, మను) క్వాలిఫికేషన్ ప్రెసిషన్. ఉదయం 5.30గంటల నుంచి.

Read More : శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత

ప్రధాన పతక పోటీలు :
టేబుల్ టెన్నిస్ : మహిళల సింగిల్స్ ఫైనల్స్ సాయంత్రం 5.30గంటల నుంచి.
ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ : మహిళల ఆల్ రౌండ్ ఫైనల్ సాయంత్రం 4.20గంటల నుంచి.

Read More : షెకావత్‎ను కలిసిన వైసీపీ ఎంపీలు

స్విమ్మింగ్ :
పురుషుల 800 మీటర్లు. ఫ్రీ స్టైల్ ఫైనల్ ఉదయం 7 గంటల నుంచి.
మహిళల 200 మీటర్లు. బటర్ ఫ్లై ఫైనల్ ఉదయం 7.58 గంటల నుంచి.
పురుషుల 100 మీటర్లు. ఫ్రీ స్టైల్ ఫైనల్ ఉదయం 8.07 గంటల నుంచి.