Tokyo Olympics Slaps : షాకింగ్.. అంతా చూస్తుండగానే, మహిళా అథ్లెట్ చెంప పగలగొట్టిన కోచ్

టోక్యో ఒలింపిక్స్ లో ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ కోచ్ మహిళా అథ్లెట్ చెంప చెళ్లుమనిపించాడు. అందరూ చూస్తుండగానే ఆమె రెండు చెంపలు పగలగొట్టాడు. అయినా ఆమె ఏమీ కోప్పడలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tokyo Olympics Slaps : షాకింగ్.. అంతా చూస్తుండగానే, మహిళా అథ్లెట్ చెంప పగలగొట్టిన కోచ్

Tokyo Olympcis Slaps

Tokyo Olympics Slaps : టోక్యో ఒలింపిక్స్ లో ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ కోచ్ మహిళా అథ్లెట్ చెంప చెళ్లుమనిపించాడు. అందరూ చూస్తుండగానే ఆమె రెండు చెంపలు పగలగొట్టాడు. అయినా ఆమె కోప్పడలేదు. అస్సలు బాధ పడలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలేం జరిగిందంటే.. ఆమె పేరు మార్టినా ట్రాజ్‌డోస్. జర్మన్ అథ్లెట్. జూడో విభాగంలో ఫైట్ కి రెడీ అవుతోంది. రింగ్ దగ్గరికి వెళుతోంది. వెనకాలు ఆమె కోచ్ వచ్చాడు. ఆ వెంటనే ఆమె కోచ్ వైపుకి తిరిగింది. అతడు.. ముందుగా మార్టినా బాడీని బాగా షేక్ చేశాడు. ఆ తర్వాత ఆమె రెండు చెంపలు చెళ్లుమనిపించాడు. ఆ తర్వాత మార్టినా రింగ్ లోకి వెళ్లింది. ఇది చూసినోళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలేం జరగుతుందో అర్థం కాక తల పట్టుకున్నారు.

దీనిపై మార్టినా స్పందించింది. కోచ్ కావాలని తనను కొట్టలేదని చెప్పింది. తానే కావాలని తన కోచ్ తో అలా కొట్టించుకున్నానని వివరణ ఇచ్చింది. ప్రత్యర్థితో తలపడేందుకు రింగ్ లోకి వెళ్లేముందు అలా కొట్టించుకుంటే నేను మేల్కొని ఉంటానని, బాగా ఫైట్ చేయగలను అని ఆమె చెప్పింది. ఒకవేళ పోటీలో నేను ఓడిపోతే నన్ను నిందించకుండా ఉండేందుకు నా కోచ్ ని అలా చేయమని నేను చెబుతాను అంది. తనలో ఫైర్ నింపేందుకు తాను చెప్పినట్టే కోచ్ చేస్తున్నాడని ఆమె తెలిపింది. ప్రతి పోటీకి ముందు తాను పాటించే సంప్రదాయం అని వివరణ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్వల్ప వ్యవధిలోనే 60 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. కోచ్ మహిళా అథ్లెట్ ను కొట్టడం చూసి అంతా షాక్ అయ్యారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి నవ్వుకున్నారు. ఎవరి పిచ్చి వారికి ఆనందం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.