Devineni Uma : గెలుస్తామనే బలుపు .. 2019లో అందుకే ఓడిపోయాం : దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు

2019 ఎన్నికల్లో ఓటమి గురించి దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు.టీడీపీ ఎందుకు ఓడిపోయిందో..? వైసీపీ ఎందుకు ఎలా గెలిచిందో వివరిస్తు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Devineni Uma : గెలుస్తామనే బలుపు .. 2019లో అందుకే ఓడిపోయాం : దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు

Devineni Uma

Andhra Politics Devineni Uma : గత ఎన్నికల్లో ఓటమిపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. నందిగామలో నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సౌమ్య తో కలిసి పాల్గొన్న ఉమ మాట్లాడుతు..2019 ఎన్నికల్లో నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో ధీమాతోను, అహంకారం వల్లే తాను ఓడిపోయానని అలాగే పార్టీ కూడా ఓడిపోయిందని ఆ బలుపు వల్లే ఓడిపోయాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రజలకు పథకాలు ఇచ్చాం, వీర పథకాలు ఇచ్చాం, వీర తిలకాలు దిద్దుకొని ఊరేగామని..కానీ ఓడిపోయామని..కానీ కాళ్లు పట్టుకొని ఒక్క ఛాన్స్ అని వైసీపీ పార్టీ గెలిచిందని అంటూ వైసీపీ నేతలపై సెటైర్లు వేశారు. మేం ఆడబిడ్డలకు పసుపు, కుంకుమ ఇచ్చాం కదాని..వీర తిలకాలు దిద్ది ఊరేగిస్తూన్నారని ఊరేగాం కానీ వైసీపీ నేతలు మాత్రం గెలిపించండమ్మా అంటూ ప్రజల కాళ్లు గడ్డాలు పట్టుకుని గెలిచేశారు అంటూ ఎద్దేవా చేశారు.

Lokesh Padayatra : లోకేశ్ చేసేది పాదయాత్ర కాదు ఫ్యాషన్ యాత్ర : అకేపాటి అమర్నాథ్ రెడ్డి

మైలవరంలో తండ్రీ కొడుకులు, నందిగామలో వసూలు బ్రదర్స్ కొండలు గుట్టలు దోచుకున్నారంటూ విమర్శలు సంధించారు. ఇసుక విషయానికొస్తే నందిగామ, మైలవరం , జగ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యే లు నెలకు ఏటు కోట్లు పంపిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. మొన్నటి వరకు మైలవరం ఎమ్మెల్యే ఇసుక కోసం నెలకు రూ.7కోట్లు పంపాడు.. ఇప్పుడు నందిగామ వంతు వచ్చింది. దీంతో రూ.7 కోట్ల ఇసుక సొమ్ము తాడేపల్లికి పంపుతున్నారంటూ విమర్శించారు.