Lokesh Padayatra : లోకేశ్ చేసేది పాదయాత్ర కాదు ఫ్యాషన్ యాత్ర : అకేపాటి అమర్నాథ్ రెడ్డి

మేము తరతరాలుగా ప్రజలకు సేవ చేస్తున్నా..నేను ఎక్కడైనా అక్రమాలకు పాల్పడినట్లు నిరూపిస్తే వాళ్ళకే ఇచ్చేస్తా..మాది భూ స్వామి కుటుంబం, వందల ఎకరాల భూములు ఉన్నాయి

Lokesh Padayatra : లోకేశ్ చేసేది పాదయాత్ర కాదు ఫ్యాషన్ యాత్ర  :  అకేపాటి అమర్నాథ్ రెడ్డి

Nara Lokesh..Akepati Amarnath Reddy

Lokesh Yuva gaLam Padayatra : నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై ఉమ్మడి కడప జిల్లా పరిషత్ ఛైర్మెన్ అకేపాటి అమర్నాథ్ రెడ్డి విమర్శలు చేశారు. లోకేష్ ది పాదయాత్ర కాదు.. ప్యాషన్ యాత్ర అంటూ ఎద్దేవా చేశారు. పాదయాత్రలో లోకేశ్ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నా..మేము సంయమనం పటిస్తున్నామన్నారు. కానీ లోకేశ్ చేసే వ్యాఖ్యలకు మా కార్యకర్తలు రెచ్చిపోయి ప్రతిఘటిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అంటూ ప్రశ్నించారు.

రెండు ఎకరాలు ఉన్న చంద్ర బాబు ఎన్ని వేల కోట్లు ఎలా సంపాదించావు? అని ప్రశ్నించారు. అకేపాడులో మేము తరతరాలుగా ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నా..ప్యాలెస్ కట్టుకున్నానని, అక్రమంగా సంపాదించుకున్నానని ఆరోపిస్తున్నారు. ఇవి సరికాదని అన్నారు. ఇవి కేవలం ఆరోపణలు మాత్రం దీంట్లో అస్సలు నిజంలేదన్నారు. నేను ఎక్కడైనా అక్రమాలకు పాల్పడినట్లు నిరూపిస్తే వాళ్ళకే ఇచ్చేస్తా..మాది భూ స్వామి కుటుంబం, వందల ఎకరాల భూములు ఉన్నాయి మాకు..తమకు కబ్జాలు చేయాల్సిన అవసరం లేదన్నారు.

ఏ ప్రభుత్వ కార్యాలయం కట్టినా స్థలం ఇవ్వడానికి సిద్ధాంతంగా ఉన్నానని ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చినప్పుడు చంద్రబాబు ఎన్ని సార్లు నన్ను సంప్రదించారో తెలుసుకుని మాట్లాడాలి అంటూ లోకేశ్ కు సూచించారు. నేను ఎంతో నిజాయితీగా ఉన్నానని..అటువంటి నాపై ఇటువంటి ఆరోపణలు చేయటం నీ అవివేకం అన్నారు. టీడీపీ చేసే విమర్శలతో ఇంకా వైసీపీ బలపదుతుందని టీడీపీని ప్రజలు నమ్మటంలేదన్నారు.

నేను స్మిమ్మింగ్ చేస్తా కానీ లోకేష్ లాగా అమ్మాయిలను పక్కన పెట్టుకునీ స్విమ్మింగ్ చేయను, ఆరోగ్యం కోసం చేస్తా.. లోకేశ్ చేసేవి చౌక బారు విమర్శలు అంటూ మండిపడ్డారు. ఈ విమర్శలపై వైసీపీ కార్యకర్తలు మండి పడుతున్నారు..ఇలాగే మాట్లాడితే ఇక లోకేష్ తిరిగే పరిస్థితి ఉండదంటూ హెచ్చరించారు.లోకేష్ ఎన్ని విమర్శలు చేసినా రాజంపేటలో వైసీపీ అభ్యర్థి గెలిచి తీరుతాడు అంటూ ధీమా వ్యక్తంచేశారు. చంద్రబాబు కబ్జా దారుడు..అక్రమాలకు మీరు పాల్పడ్డారు అంటూ ఆరోపించారు అకేపాటి అమర్నాథ్ రెడ్డి.