DL Ravindra Reddy : అధికారం కోసం అడ్డదారులు తొక్కడం మంచిది కాదు-డీఎల్ షాకింగ్ కామెంట్స్

అధికారం కోసం అడ్డదారులు తొక్కడం మంచిది కాదన్నారు డీఎల్(DL Ravindra Reddy). జగన్ అనే వ్యక్తికి డబ్బుతో పనిలేదని.. ప్రజలకు సేవ చేస్తారని ఆశించామని..

DL Ravindra Reddy : అధికారం కోసం అడ్డదారులు తొక్కడం మంచిది కాదు-డీఎల్ షాకింగ్ కామెంట్స్

Dl Ravindra Reddy

DL Ravindra Reddy : ఏపీలో సంచలనం రేపిన మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి స్పందించారు. సీఎం జగన్ ను ఉద్దేశించిన ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కడం మంచిది కాదన్నారు డీఎల్. జగన్ అనే వ్యక్తికి డబ్బుతో పనిలేదని.. ప్రజలకు సేవ చేస్తారని ఆశించామని.. కానీ.. పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు.అధికారం కోసం అడ్డదారులు తొక్కడం మంచిది కాదన్నారు డీఎల్. జగన్ అనే వ్యక్తికి డబ్బుతో పనిలేదని.. ప్రజలకు సేవ చేస్తారని ఆశించామని.. కానీ.. పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. (DL Ravindra Reddy)

వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1981లో తనకు వివేకాను పరిచయం చేశారని డీఎల్ తెలిపారు. వివేకాతో తనకు రాజకీయంగా సన్నిహిత సంబంధాలు ఉండేవన్నారు. వివేకా చాలా మంచి వ్యక్తి అని చెప్పారు. అంతటి మంచి వ్యక్తిని హత్య చేయడం బాధించిందన్నారు. ఎర్ర గంగిరెడ్డి నిత్యం వివేకా దగ్గర ఉండేవాడని డీఎల్ చెప్పారు. ఎర్ర గంగిరెడ్డికి ఫోన్ చేయగా వివేకా గుండెపోటుతో మరణించారని చెప్పాడన్నారు. నేను కాల్ చేసిన విషయం కూడా మరిచి పోయిన తర్వాత ఎస్పీ అభిషేక్ మహంతి… ఎందుకు కాల్ చేశారని తను విచారించగా తాను విషయం చెప్పానని తెలిపారు.

”ఎర్రగంగిరెడ్డి.. దేవిరెడ్డి శంకర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల సమయం నుండి టచ్ లో ఉన్నట్లు కాల్ డేటా లో తెలిసింది. వివేకా పీఏ కృష్ణారెడ్డి కూడా శంకర్ రెడ్డి కి టచ్ లో ఉన్నట్లు కాల్ డేటా లో తేలింది. ఆ విషయం తెలియక మొదట కృష్ణారెడ్డితో వివేకా కూతురు సునీత కంప్లైంట్ ఇప్పించారు. కృష్ణా రెడ్డి, శంకర్ రెడ్డి ఏం చెబితే అది కంప్లైంట్ గా రాసిచ్చారు. వివేకా కూతురు సునీత తన తండ్రి మరణంపై అనుమానం ఉందని పులివెందులకు బయలుదేరి వచ్చారు. అనంతరం విజయమ్మ, షర్మిల కూడా హైదరాబాద్ నుండి బయలుదేరి వచ్చారు.

Chandrababu Viveka : అన్నింటిని మేనేజ్ చేయగలిగిన వాడినే అయితే.. ఎందుకు ఓడిపోతాను? చంద్రబాబు

చంద్రబాబు వివేకాను హత్య చేయించారని ఓ పేపర్ లో వేయించారు. కోడికత్తి అడ్డుపెట్టుకుని సీఎం జగన్ రాజకీయాలు చేశారు. జగన్ అనే వ్యక్తికి డబ్బుతో పని లేదు, ప్రజలకు సేవ చేస్తారని ఆశించాము. కానీ పరిస్థితి భిన్నంగా ఉంది. డాక్టర్ సునీత రాజశేఖర్ తదితరులు వివేకానంద చంపారని పేపర్ లో రాయడం సిగ్గుచేటు. పులివెందులలో ఎవరిని అడిగినా వివేకాను ఎవరు చంపింది నిక్కచ్చిగా చెబుతున్నారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కడం మంచిది కాదు.

అవగాహన లేకనే సిపిఎస్ రద్దు చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారని సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అనడం సిగ్గుచేటు. సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. అది చెల్లదు. డాక్టర్ సునీత ఆమె భర్త మా ఇంటికి వచ్చారని అవినాష్ రెడ్డి కామెంట్ చేశారు. ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమానికి వచ్చి భోజనానికి ఇంటికి రావడం జరిగింది. వివేకా కూతురు సునీత టీడీపీలోకి వెళ్తుందని సజ్జల చెప్పడం అవాస్తవం. సునీత, ఆమె భర్త రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదు.

Sajjala : వివేకా హత్య కేసు.. సీబీఐ ఛార్జిషీట్‌లో కుట్ర ఉంది-సజ్జల సంచలనం

సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరిగా జీవితం ప్రారంభించి ఈరోజు వేల కోట్లు సంపాదించారు. సజ్జల.. కడప జిల్లాలో అనేక మంది బ్రోకర్లను ఏర్పాటు చేసుకుని వసూళ్లు ప్రారంభించాడు. అవినాష్ రెడ్డి హత్య చేశారని తేలితే కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని చెప్పారు. నాకు తెలిసినంత వరకు ఆయన తప్పించుకోలేరు. నాకు సీబీఐ మీద ప్రగాఢ నమ్మకం ఉంది. వివేకా హత్య కేసులో సీబీఐ చాలా నిబద్ధతతో పని చేస్తోంది. సీబీఐ చాలా తెలివిగా వివేకా హత్య కేసు విచారణ చేస్తోంది. వివేకా హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారులు జైల్లో ఉన్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారని అంటున్నారు. తప్పుచేసిన వారు తప్పించుకునే ప్రసక్తే లేదు. దానికి ఉదాహరణ లాలూ ప్రసాద్ యాదవ్. తప్పు చేస్తే ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా.. శిక్ష అనుభవించాల్సిందే” అని డీఎల్ అన్నారు.