ED Raids In NRI hospital : విజయవాడ NRI హాస్పిటల్‌లో ఈడీ రైడ్స్

తెలుగు రాష్టాల్లో మరోసారి ఈడీ సోదాలు (ED Raids) హడలెత్తిస్తున్నాయి. ఎప్పుడు ఏ రాజకీయ నేత..ఏ వ్యాపారవేత్తలపై వచ్చి పడతారో తెలియని పరిస్థితి ఉంది. ఈక్రమంలో ఏపీలో మరోసారి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా విజయవాడలోని NRI హాస్పిటల్ లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నాయి. నాలుగు వాహనాలల్లో వచ్చిన అధికారులు క్షుణ్ణంగా అన్నింటిని పరిశీలిస్తున్నారు.

ED Raids In NRI hospital : విజయవాడ NRI హాస్పిటల్‌లో ఈడీ రైడ్స్

ED Raids In vijayawada NRI hospital

ED Raids In vijayawada NRI hospital : తెలుగు రాష్టాల్లో మరోసారి ఈడీ సోదాలు (ED Raids) హడలెత్తిస్తున్నాయి. ఎప్పుడు ఏ రాజకీయ నేత..ఏ వ్యాపారవేత్తలపై వచ్చి పడతారో తెలియని పరిస్థితి ఉంది. ఈక్రమంలో ఏపీలో మరోసారి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా విజయవాడలోని NRI హాస్పిటల్ లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నాయి. నాలుగు వాహనాలల్లో వచ్చిన అధికారులు క్షుణ్ణంగా అన్నింటిని పరిశీలిస్తున్నారు.

మెడికల్ కళాశాలకు చెందిన యాజమాన్యంతో పాటు డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. యాజమాన్య సీట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఈ సోదాలు జరుగుతున్నాయి. మొత్తం నాలుగు వాహనాల్లో ఈడీ కార్యాలయం నుంచి అధికారులు బయలుదేరి వెళ్లారు. తనిఖీల్లో ఉన్న ఈడీ అధికారులకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించారు.

ఏకకాలంలో విజయవాడ, మంగళగిరి, ఒడిశాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో ఎన్‌ఆర్‌ఐ కమిటీ సభ్యురాలు అక్కినేని మణి ఎన్‌ఆర్‌ఐ నిధులతో సొంత ఆస్పత్రికి వైద్య పరికరాలు కొన్నారనే ఆరోపణలపై ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఎన్నారై ఆస్పత్రి నిర్వాహకురాలిగా అక్కినేని మణి ఉన్నారు. పాత మేనేజ్ మెంట్ డైరెక్టర్ల ఇళ్లల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. 2022 ఆగస్టులో డాక్టర్ మణి అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రిని ప్రారంభించారు. ఈక్రమంలో ఎన్నారై ఆస్పత్రి నిధులు అక్కినేని ఆస్పత్రికి తరలించారనే ఆరోపణలు రావటంతో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.

కాగా ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఈడీ అధికారులు విరుచుకుపడుతున్నారు. వ్యాపారవేత్తలు,రాజకీయ నాయకులు, షాపింగ్ మాల్స్ ఇలా పలు రంగాలపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక గతం కంటే ఈడీ దాడులు పెరిగాయి. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే స్వయంగా తెలిపింది.

గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఈడీ దాడులు 27 రెట్లు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2004-2014 మధ్య 112 ఈడీ దాడులు జరిగితే.. 2014-2022 మధ్య కాలంలో 3010 సార్లు ఈడీ దాడులు జరిగాయని మంగళవారం (7,2022)రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అయితే మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద గతంలో నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా ప్రస్తుతం దాడులు జరపాల్సి వస్తోంది అంటూ వెల్లడించారు..