Election Campaign: ముగిసిన ప్రచారం పర్వం.. హుజూరాబాద్, బద్వేల్‌లో హోరాహోరీ పోటీలు

ఉత్కంఠభరితంగా సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. అక్టోబర్ 27 సాయంత్రం 7 గంటలకు ప్రచార పర్వానికి ముగింపు పలికారు.

Election Campaign: ముగిసిన ప్రచారం పర్వం.. హుజూరాబాద్, బద్వేల్‌లో హోరాహోరీ పోటీలు

BY ELECTION

Election Campaign: ఉత్కంఠభరితంగా సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. అక్టోబర్ 27 సాయంత్రం 7 గంటలకు ప్రచార పర్వానికి ముగింపు పలికారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు, ముఖ్యనేతలు గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. బీజేపీ, టీఆర్ఎస్‌ల తరపున ఈటల రాజేందర్, మంత్రి హరీశ్ రావు ప్రచారంలో దూసుకుపోయారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నీ తానై ప్రచారంలో పాల్గొనగా.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు తోడుగా హరీశ్ ప్రచారంలో పాల్గొన్నారు.

ప్రచారంలో భాగంగా ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపించుకున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలే డబ్బులు పంచుతున్నాయని టీఆర్ఎస్, బీజేపీలు పరస్పరం ఎండగట్టుకుంటున్నారు. టీఆర్ఎస్ భారీగా డబ్బు పంచుతోందని.. డబ్బు తీసుకుని తమకే ఓటేయాలని ఓటర్లకు పిలుపునిస్తోంది.

బద్వేల్ ప్రచారం..
బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం.. అక్టోబర్ 27 సాయంత్రంతో ముగిసింది. అధికార పార్టీ వైసీపీతో పాటు పోటీగా పలు పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టాయి. మొత్తం 15మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్పినట్లుగా రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో 48గంటల ముందుగానే ప్రచారం ఆపేశారు. వైసీపీ తరపున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రచారంలో పాల్గొన్నారు. నవంబర్ 2న ఉపఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి.

…………………………………….: ‘చెత్తను పారేయకండి.. అమ్మేయండిలా.. లేదా గిఫ్ట్‌ ఇవ్వండి’