Face Recognition Attendance App : ఫేస్ యాప్.. ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స చర్చలు సఫలం

ఫేస్ రికగ్నిషన్ యాప్ అటెండెన్స్ వివాదాలపై ఏపీ ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చర్చలు సఫలం అయ్యాయి. దాదాపు రెండు గంటల పాటు సమావేశం జరిగింది. ప్రధానంగా ఫేస్ యాప్ పైనే చర్చ జరిగింది.

Face Recognition Attendance App : ఫేస్ యాప్.. ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స చర్చలు సఫలం

Face Recognition Attendance App : ఫేస్ రిగ్నిషన్ యాప్ అటెండెన్స్ వివాదాలపై ఏపీ ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చర్చలు సఫలం అయ్యాయి. దాదాపు రెండు గంటల పాటు సమావేశం జరిగింది. ప్రధానంగా ఫేస్ యాప్ పైనే చర్చ జరిగింది. ఫేస్ రికగ్నిషన్ యాప్ ను తమ ఫోన్ లలోనే డౌన్ లోడ్ చేసుకునేందుకు టీచర్లు అంగీకరించారని చెప్పారు మంత్రి బొత్స. అయితే యాప్‌లో సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు 15 రోజుల గడువు కోరారని మంత్రి బొత్స వెల్లడించారు.

సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని టీచర్లు మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. సాంకేతిక సమస్యలన్నింటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రి బొత్స అన్నారు. విద్యా వ్యవస్థలో మార్పు తెచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు మంత్రి బొత్స.

ఫేస్ రికగ్నిషన్ యాప్ అమలుకు ఉపాధ్యాయులు 15 రోజుల గడువు కోరారని తెలిపిన మంత్రి బొత్స.. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నారు. సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పామని మంత్రి బొత్స తెలిపారు.

తమ ఫోన్లలోనే యాప్ డౌన్ లోడ్ చేసుకునేందుకు అంగీకరించామని ఎస్టీయూ అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ చెప్పారు. కాగా, సాంకేతిక సమస్యలు ఉన్నాయని మంత్రికి వివరించామని.. ఫేస్ యాప్ అటెండెన్స్ లో ఉన్న టెక్నికల్ ఎర్రర్స్ పరిశీలించేందుకు 15 రోజుల సమయం కోరామని సాయి శ్రీనివాస్ తెలిపారు. సాంకేతిక ఇబ్బందులు తొలగించిన తర్వాతే.. పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. టైమ్ ప్రకారం అటెండెన్స్ వేసినా.. అప్ లోడింగ్ లో సమస్యుంటే.. పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి బొత్స చెప్పారని సాయి శ్రీనివాస్ వెల్లడించారు.

ఇక ఫేస్ రిక్నగేషన్ అటెండెన్స్ కు జీతాలతో లింకు పెట్టమని మంత్రి బొత్స హామీనిచ్చారని తెలిపారు. కాగా, యాప్ వినియోగానికి డివైజ్ లు ఇవ్వాలని టీచర్లు కోరగా.. అందుకు మంత్రి బొత్స అంగీకరించలేదని చెప్పారు. ఎవరి ఫోన్‌లో వారే అటెండెన్స్ వేసుకోవాలన్న మంత్రి బొత్స.. వ్యక్తిగత డేటాకు ఇబ్బంది ఉండదని చెప్పారని టీచర్లు వెల్లడించారు.