Andhra Pradesh High court : జీవో నంబర్ 1పై హైకోర్టులో సీపీఐ రామకృష్ణ పిటీషన్ .. విచారణ చేపట్టిన ధర్మాసనం

రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తూ జీవో నెంబర్ 1 విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ జీవో నెంబర్ 1పై సీపీఐ కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను ధర్మాసనం విచారణకు స్వీకరించింది.దీనిపై విచారణ చేపట్టింది కోర్టు.

Andhra Pradesh High court : జీవో నంబర్ 1పై హైకోర్టులో సీపీఐ రామకృష్ణ పిటీషన్ .. విచారణ చేపట్టిన ధర్మాసనం

G O Number-1

Andhra Pradesh High court :  రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తూ జీవో నెంబర్ 1 విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ జీవో నెంబర్ 1పై సీపీఐ కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను ధర్మాసనం విచారణకు స్వీకరించింది.దీనిపై విచారణ చేపట్టింది కోర్టు. జీవో నెంబర్ 1 పై రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు విన్పించారు. ఈ పిల్ దాఖలు చేయటంపై తమకు ఎటువంటి సమాచారం లేదని అడ్వకేట్ జనరల్ తెలిపారు. సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లకుండా ప్రతిపక్ష పార్టీలను అడ్డుకోవటానికే ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 1ను తీసుకొచ్చిందని పిటీషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించగా..దీనిపై ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సమాధానమిస్తే ఇవన్నీ రాజకీయపరంగా చేసే వాదనలేనని కొట్టిపారేశారు. విధాన పరమైన నిర్ణయాలకు సంబంధించిన పిటిషన్లపై విచారించవద్దని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదించారు.

AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం..

కాగా రోడ్లపై సభలు, ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించడాన్ని నిషేధిస్తూ జనవరి 2న వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1ని విడుదల చేసింది. ఈ జీవో నెంబర్ 1 పై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విపక్ష పార్టీలు సభలు , సమావేశాలు నిర్వహించకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను తీసుకు వచ్చిందని ఆరోపిస్తున్నాయి. ఇదొక నల్ల చట్టం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. బ్రిటీష్ కాలంనాటి ఆంక్షలు విధిస్తున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

ఈక్రమంలో చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో ఈ జోవోను అడ్డు పెట్టుకుని పోలీసులు ఆయన పర్యటనను అడ్డుకున్నారు. చంద్రబాబు ప్రచార రథం వాహనం తాళాలు పట్టుకుపోయారు. చంద్రబాబును కుప్పం వదిలి వెళ్లిపోవాలని ఆదేశించారు. పోలీసుల తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. రోడ్డుపై బైఠాయించి నా నియోజక వర్గంలోనే నేను పర్యటించటానికి అనుమతి లేదని ఎలా అంటారు? నా ప్రచార రథాలు , ఇతర వాహనాలను పోలీసులు సీజ్ చేయటం ఏంటీ అంటూ ప్రశ్నించారు. దీనికి సంబంధించి డీజీపీకి లేఖ రాసినా ఎటువంటి స్పందన లేకపోవటంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సైకో సీఎం పాలనలో పోలీసులు బానిసలుగా మారారు అంటూ పోలీసుల తీరుపై విమర్శలు చేశారు.

Andhra Pradesh : సభలు, ర్యాలీలు నిషేధంపై రాజకీయ రగడ.. పవన్ ‘వారాహి’ యాత్ర, లోకేశ్ పాదయాత్రలకు అడ్డుకోవటానికేనంటూ విమర్శలు

2022డిసెంబర్ 28న ప్రకాశం జిల్లా కందుకూరులో చంద్రబాబు రోడ్ షో లో జరిగిన తొక్కిసలాట లో ఎనిమిది మంది మృతి చెందారు. అలాగే గుంటూరులో చంద్రన్న సంక్రాంతి కిట్ పంపిణీ సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఈ రెండు ఘటనలతో జీవో నెంబర 1ను ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం అంటూ టీడీపీ, జనసేనతో పాటు వామపక్షాలు కూడా విమర్శించాయి. ఈక్రమంలో జీవో నెంబర్ 1ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ పిటీషన్ దాఖలు చేశారు.

Andra pradesh : కుప్పంలో చంద్రబాబు ప్రచార రథాన్ని సీజ్ చేసిన పోలీసులు