Ashadam : గోదారోళ్ళ ఆషాడం సారె అదిరింది..టన్నుచేపలు..10మేకపోతులు..బిందెలకొద్దీ స్వీట్లు

యానాంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తోట రాజు కుమారుడు పవన్ కుమార్ కు రాజమహేంద్రవరానికి చెందిన బత్తుల బలరామకృష్ణ కుమార్తె ప్రత్యూషతో ఇటీవలే వివాహం జరిగింది.

Ashadam : గోదారోళ్ళ ఆషాడం సారె అదిరింది..టన్నుచేపలు..10మేకపోతులు..బిందెలకొద్దీ స్వీట్లు

Yanam

Ashadam : సాంప్రదాయాలు పాటించాలంటే తెలుగు వారి తరువాతే. అందులోనూ గోదావరిజిల్లాలు తెలుగింటి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. అచార వ్యవహారాల్లో ఏమాత్రం తేడా వచ్చినా తలెత్తుకుని తిరిగే పరిస్ధితి ఉండదు. ఏవిషయంలోనూ తగ్గేదే లేదన్న స్వభావం అక్కడి వారికి నరనరాల్లో జీర్ణించుకుని ఉంటుంది. అమ్మాయికి పెళ్ళి చేసి అత్తవారింటికి పంపేసమయంతోపాటు, వివిధ రకాల సందర్భాల్లో సామాన్యుల నుండి ఉన్నతస్ధాయి వర్గాల వరకు తమకున్న దాంట్లో గొప్పగా కానుకలు సమర్పించటం ఆనవాయితీ..అయితే యానంలో అల్లుడింటికి చేరిన మామగారి సారె కానుకలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

యానాంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తోట రాజు కుమారుడు పవన్ కుమార్ కు రాజమహేంద్రవరానికి చెందిన బత్తుల బలరామకృష్ణ కుమార్తె ప్రత్యూషతో ఇటీవలే వివాహం జరిగింది. ఆషాడ మాసం రావటంతో అల్లుడింటికి మామగారి ఇంటినుండి సారె కానుకలు పంపటం ఆనవాయితీ. దీనినే ఆషాడం కావిళ్ళు అనిపిలుస్తారు. ఆ ఆనవాయితీ కొనసాగింపుగా రాజమహేంద్ర వరంలోని మామ బలరామకృష్ణ ఇంటి నుండి యానంకు ఆషాడం కావిళ్ళు పంపారు. వచ్చిన సారెను చూసి అల్లడు పవన్ కుమార్ అవాక్కయ్యాడు.

ఒక టన్నుచేపలు, రొయ్యలు, పండుగప్పలు, బిందెల్లో 50 రకాల స్వీట్లు, 50 పందెం కోడి పుంజులు, 10 మేకపోతులు, 250 కిలోల కిరాణా సామాగ్రి, 250 రకాల అవకాయ జాడీలు, ఇలా అనేక రకాల వస్తువులను ఆషాడం సారెగా అల్లుడు ఇంటికి పంపారు మామ బలరామకృష్ణ. ఊరేగింపుగా వచ్చిన ఈ ఆషాడం కావిళ్ళ సారెను చూసి స్ధానికులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం యానం మొత్తం ఈ సారె గురించిన చర్చే సాగుతుంది.