Gold Ornaments : సముద్ర తీరంలో బంగారు ఉంగరాలు, ముక్కుపుడకలు

ఉప్పాడ సముద్ర తీరంలో బంగారం వేట కొనసాగుతుంది. స్థానిక మత్స్యకారులు బుధవారం కూడా తీరంలో బంగారం కోసం జల్లెడపట్టారు. చిన్నారులు స్కూల్ మానేసి వచ్చి బంగారం కోసం వెతుకుతున్నారు.

Gold Ornaments : సముద్ర తీరంలో బంగారు ఉంగరాలు, ముక్కుపుడకలు

Gold Ornaments

Gold Ornaments : ఉప్పాడ సముద్ర తీరంలో బంగారం వేట కొనసాగుతుంది. స్థానిక మత్స్యకారులు బుధవారం కూడా తీరంలో బంగారం కోసం జల్లెడపట్టారు. చిన్నారులు స్కూల్ మానేసి వచ్చి బంగారం కోసం వెతుకుతున్నారు. ఇక కొందరికి బంగారు రేణువులు దొరకగా, మరికొందరికి ఉంగరాలు, ముక్కుపుడలకు దొరికాయి. కాగా గతంలో ఈ ప్రాంతంలోనే వెండి నాణేలు కుప్పలు తెప్పలుగా దొరికాయి.

చదవండి : Gold Rate : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ఈ సారి బంగారం కనిపించడంతో ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. గతంలోని రాజుల కోటలు, పలు దేవాలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని, వాటిలో ఉన్న వస్తువులు తుపాన్‌ సమయాల్లో బయటపడుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. బంగారం దొరుకుతుండటంతో మత్స్యకారులు చేపల వేటకు కూడా వెళ్లకుండా ఉప్పాడ తీరంలోనే తిష్టవేశారు.

చదవండి : Golden Mask : ఈ బంగారం మాస్క్ ఖరీదు రూ.5.70 లక్షలు