Andhra Pradesh: 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్ర‌భుత్వం శుభ‌వార్త.. ఫైల్‌పై జ‌గ‌న్ సంత‌కం

ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్ర‌భుత్వం శుభ‌వార్త తెలిపింది. వారికి న్యాయం చేసేలా ఇందుకు సంబంధించిన ఫైల్‌పై ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతకం చేశారు.

Andhra Pradesh: 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్ర‌భుత్వం శుభ‌వార్త.. ఫైల్‌పై జ‌గ‌న్ సంత‌కం

Andhra Pradesh: ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్ర‌భుత్వం శుభ‌వార్త తెలిపింది. వారికి న్యాయం చేసేలా ఇందుకు సంబంధించిన ఫైల్‌పై ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతకం చేశారు. 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగం ఇచ్చే దిశగా ప్ర‌భుత్వం విధివిధానాలను సిద్ధం చేస్తోంది. త్వరలోనే వారికి ప్ర‌భుత్వం న్యాయం చేస్తుంద‌ని ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి తెలిపారు. 20 ఏళ్లుగా పెడింగ్‌లో ఉన్న 1998 డీఎస్సీ ఫైల్‌పై సీఎం సంతకం చేశారని వివ‌రించారు.

Agnipath : ఆర్మీ జవాన్‌ కావాలని కలలుకన్న యువకుడు ‘అగ్నిపథ్’ ఆందోళనల్లో మృతి

త‌మ‌కు ఏ ప్రభుత్వమూ న్యాయం చేయలేదని గ‌తంలో జ‌గ‌న్‌కు డీఎస్సీ అభ్య‌ర్థులు చెప్పార‌ని ఆమె గుర్తు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమే న్యాయం చేస్తారని వాళ్ళు విన్నవించారని అన్నారు. వారి కోరిక మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సానుకూల నిర్ణయం తీసుకున్నార‌ని చెప్పారు. గత ప్రభుత్వం ఎమ్మెల్సీ కమిటీ వేసినా 1998, 2008 డీఎస్సీ అర్హుల‌కు న్యాయం చేయలేదని ఆమె చెప్పారు. 2008 వారికి కూడా సీఎం జ‌గ‌నే న్యాయం చేశారని ఆమె అన్నారు. 4,565 మందికి ఇప్పుడు ల‌బ్ధిచేకూర‌నుంద‌ని, త్వరలోనే మార్గ‌ద‌ర్శ‌కాలు వస్తాయని, విధివిధానాలు రూపొందిస్తున్నారని అన్నారు.