Village ward secretariat employees : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పంట పండింది.. భారీగా పెరిగిన జీతాలు

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పంట పండింది. జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలవనుంది. వారందరిని శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తారు. అగస్టు నుంచి కొత్త జీతాలు అందుకోనున్నారు.

Village ward secretariat employees : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పంట పండింది.. భారీగా పెరిగిన జీతాలు

Village Ward Secretariat Employees

Village ward secretariat employees : ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పంట పండింది. సచివాలయ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పొబ్రేషన్ డిక్లరేషన్ జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని డిపార్ట్ మెంటల్ పరీక్ష పాస్ అయినవారందరి ప్రొబేషన్ ను ఖరారు చేసింది. ప్రొబేషన్ ను డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 5ని విడుదల చేసింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలవనుంది. జూలై 1 వారందరిని శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తారు. అగస్టు నుంచి కొత్త జీతాలు అందుకోనున్నారు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించేలా ఆదేశాలు జారీ చేయడంతో సీఎం జగన్ కు ఏపీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు. తమ శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తూ, కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించేలా ప్రభుత్వం జీవో జారీ చేయడంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లకు తమ కోరిక నేరవేరిందని సంతోషిస్తున్నారు.

2019లో గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం 1 లక్షా 35వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. వాటిలో 1.21 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసింది. రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ రూ.15వేల స్టైఫండ్ ఇచ్చిన ప్రభుత్వం… గతేడాది నవంబర్ లో ప్రొబేషన్ ఖరారు కోసం పరీక్షలు నిర్వహించింది.

పోస్టుల వారీగా ప్రభుత్వం ఖరారు చేసిన పే స్కేల్ వివరాలు చూస్తే..
* పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-5కి 23,120-74,770గా ఖరారు.
* మిగిలిన పోస్టులకు రూ.22,460-72,810గా ఫిక్స్ చేశారు.
* అలాగే వార్డ్ అడ్మిన్ సెక్రటరీకి రూ. 23,120-74,770గా ఖరారు.
* ఇందులో బేసిక్ పేకి హెచ్ఆర్ఏ, డీఏలు అదనంగా రానున్నాయి.

ప్రభుత్వం పేర్కొన్న పే స్కేల్ లో మూలవేతనానికి అలవెన్సులు కలవడంతో ఒక్కొక్కరికి దాదాపు రూ.30వేల వరకు జీతాలు వచ్చే అవకాశముంది. వీటిలో గ్రామ సచివాలయ ఉద్యోగులతో పోలిస్తే.. పట్టణాలు, నగరాల్లో పనిచేసే వార్డు సచివాలయ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ ఆధారంగా జీతాలు ఎక్కువ వచ్చే అవకాశముంది.

2019 అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఉద్యోగాలకు ఎంపికైన వారందరికీ రెండేళ్లపాటు ప్రొబేషన్ ఉంటుందని అప్పట్లోనే ప్రభుత్వం తెలిపింది. ఈ రెండేళ్లు నెలకు రూ.15వేల చొప్పున జీతాన్ని ఖరారు చేసింది. వీరిలో 2021 అక్టోబర్ 2 నాటికి 40వేల మంది, 2021 అక్టోబర్ 30నాటికి 30వేల మంది, 2021 నవంబర్ నెలాఖరుకు 50వేల మంది రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ పూర్తయింది.