ఏపీలో ఈసీ విశ్వసనీయతపై అనుమానం కలుగుతుంది : వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి

విద్యా దీవెన, చేయూత పథకాల నిధులు విడుదల ఆపేశారు. వ్యవస్థను ఆదేశించే రీతిలో కూటమి పార్టీలు ఉన్నాయని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు.

ఏపీలో ఈసీ విశ్వసనీయతపై అనుమానం కలుగుతుంది : వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి

YCP MLC Lella Appi reddy

Updated On : May 7, 2024 / 1:36 PM IST

MLC Lella Appi Reddy : ఏపీలో ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపై అనుమానం కలుగుతుందని, చంద్రబాబు ట్రాప్ లో ఈసీ అధికారులు పడొద్దని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ఏ రాష్ట్రంలో అయినా ఒకే రూల్ ఫాలో అవుతుంది కదా.. కానీ, పక్క రాష్ట్రాల్లో ఒకలా.. ఏపీలో ఒకలా రూల్స్ ఫాలో అవుతున్నారని ఆరోపించారు.

Also Read : చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే: సీఎం జగన్

టీడీపీ, బీజేపీ పార్టీల అధ్యక్షులు లెటర్స్ రాస్తే ఆన్ గోయింగ్ పథకాలు ఆపేస్తున్నారు. తెలంగాణలో రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వడానికి ఈసీ అనుమతి ఇచ్చింది.. ఏపీలో మాత్రం వీలు లేదని ఆదేశాలు ఇచ్చింది. జమ్మూ కశ్మీర్ లోనూ ఇన్ ఫుట్ సబ్సిడీకి ఈసీ అనుమతి ఇచ్చింది. ఎన్నికల కమిషన్ రూల్స్ లో ఈ వ్యత్యాసం ఎందుకని వైసీపీ ఎమ్మెల్సీ ప్రశ్నించారు.

Also Read : PM Modi : కేంద్రంలో మరోసారి వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమే- రాజమండ్రిలో ప్రధాని మోదీ

విద్యా దీవెన, చేయూత పథకాల నిధులు విడుదల ఆపేశారు. వ్యవస్థను ఆదేశించే రీతిలో కూటమి పార్టీలు ఉన్నాయని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. వృద్ధులకు ఇంటి వద్దనే పెన్షన్ ను ఇలానే అడ్డుకున్నారు. పథకాల నిధులు విడుదల ఆపేసి పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని అప్పిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటి ప్రధాని సభలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి పవన్, చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రశ్నించారు.