Goutham Reddy: రాబోయే మూడేళ్లలో ఏపీనే నెంబర్‌వన్

సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల వలన రాష్ట్రంలో జీఎస్డీపీ బాగుందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి శాఖమంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండ్లు పూర్తైన సందర్బంగా మంగళరిగిలోని ఏపిఐఐసి

Goutham Reddy: రాబోయే మూడేళ్లలో ఏపీనే నెంబర్‌వన్

Goutham Reddy

Goutham Reddy: సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల వలన రాష్ట్రంలో జీఎస్డీపీ బాగుందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి శాఖమంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండ్లు పూర్తైన సందర్బంగా మంగళరిగిలోని ఏపిఐఐసి కార్యాలయంలో పరిశ్రమల శాఖ ప్రోగ్రెస్ రిపోర్ట్ పై కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం తక్కువ చెప్పుకొని ఎక్కువ అభివృద్ధి చేస్తుందని అన్నారు.

పరిశ్రమల అభివృధ్ధికోసం దేశంలో ఎక్కడ లేని విధంగా మూడు ఇండస్ట్రియల్ కారిడార్లను ఏర్పాటు చేశామని తెలియచేశారు. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ లో త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. కడప జిల్లాలో వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్, ఎస్ ఆర్ కార్పోరేషన్ తో జాయింట్ వెంచర్ ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభం కాబోతుందని గౌతమ్ రెడ్డి అన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ ఉదృతి సమయంలో రాష్ట్రం తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఎదురుకుందని, రాష్ట్రంలోని పరిశ్రమలల్లో ఆక్సిజన్ ఉత్పత్తి చేసి ఆ కొరతను తీర్చామని వివరించారు.

ప్రభుత్వం అన్ని రంగాలపై ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తుందని తెలిపారు గౌతమ్ రెడ్డి. ఇక విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు 30 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలను ప్రారంభించబోతున్నామని వివరించారు. రాబోయే మూడేళ్ళలో పారిశ్రామిక రంగంలో రాష్ట్రాన్ని మొదటిస్థానంలో నిలబడతామని తెలిపారు గౌతమ్ రెడ్డి.