Group War In Nagari YSRCP : మంత్రి రోజాపై టార్గెట్.. నగరిలో మరోసారి వైసీపీ బైటపడ్డ వర్గపోరు .. స్థానికులకే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్

వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సాక్షిగా.. నగరిలో మరోసారి వైఎస్సార్‌సీపీలో వర్గపోరు బయటపడింది. వైఎస్సార్ వర్థంతి కార్యక్రమాలను రోజా వ్యతిరేక వర్గం ఆమె లేకుండానే నిర్వహించింది. ఏకంగా మంత్రి రోజాను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఐదు మండలాల్లోని ముఖ్య నేతల్లో ఒకరికే ఈ ఎన్నికల్లో సీటు కేటాయించాలంటూ నేతలు అల్టిమేటం ఇచ్చారు.

Group War In Nagari YSRCP : మంత్రి రోజాపై టార్గెట్.. నగరిలో మరోసారి వైసీపీ బైటపడ్డ వర్గపోరు .. స్థానికులకే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్

Group War In Nagari YSRCP

Group War In Nagari YSRCP : నగరి అంటే రోజా రోజా అంటే నగరి అని గొప్పలు చెప్పుకునే మంత్రి రోజాకు ఆ పార్టీ నుంచి నిరసన సెగలు కొనసాగుతున్నాయి. అసలే ఫైర్ బ్రాండ్..నోటికి ఎంత వస్తే అది వ్యాఖ్యానించే రోజా మంత్రి అయినప్పటినుంచి రోజా నోటికి హద్దూ పద్దూ లేకుండాపోతోంది. పదవుల కోసం వైసీపీ నేతలు టీడీపీ టార్గెట్ చేసి నోరు పారేసుకుంటారనే విమర్శలు ఉన్నాయి.  బహుశా అందుకేనేమో మంత్రి వదవి వచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. నగరినుంచి గెలిచిన రోజా తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం చేతకాదు కానీ నోటి దురుసుకేమి తక్కువుండదు అంటుంటారు. ఇదేదో ప్రతిపక్ష పార్టీ నేతలు అనటం కాదు సొంతపార్టీ నేతలే అంటుంటారు. ఆ నోటి దురుసే ఆమెకు మంత్రి పదవి తెచ్చిపెట్టిందో ఏమోగా ఈ విషయం పక్కనపెడితే..నగరి నియోజకవర్గంలో సొంతపార్టీ నుంచే రోజాకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సొంత పార్టీ నుంచి రెబల్స్ బెడద ఉన్నా వాటిని మాత్రం రోజా కట్టడి చేయలేకపోతున్నారు.

ఈ క్రమంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సాక్షిగా.. నగరిలో మరోసారి వైఎస్సార్‌సీపీలో వర్గపోరు బయటపడింది. వైఎస్సార్ వర్థంతి కార్యక్రమాలను రోజా వ్యతిరేక వర్గం ఆమె లేకుండానే నిర్వహించింది.  ఏకంగా మంత్రి రోజాను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఐదు మండలాల్లోని ముఖ్య నేతల్లో ఒకరికే ఈ ఎన్నికల్లో సీటు కేటాయించాలంటూ నేతలు అల్టిమేటం ఇచ్చారు. ఎమ్మెల్యే రోజా ప్రజలకు అందుబాటులో లేరని..మంత్రి కార్యకర్తలను పట్టించుకోవడం లేదని..రోజాను గెలిపించిన వైసీపీ కార్యకర్తలను హీనంగా చూస్తున్నారని.. నగరిలో రోజా ఎలాంటి అభివృద్థి చేయలేదంటూ విమర్శిస్తున్నారు ఈడిగ కార్పొరేషన్ ఛైర్ పర్సన్‌ కె.జె.శాంతి. రోజాను టార్గెట్ చేసి వైసీపీ నేతలు వైఎస్సార్ వర్థంతి వేడులు చేశారు. ర్యాలీ చేపట్టారు. ఇది చిత్తూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రోజాపై సొంతపార్టీ నేతలే నిప్పులు కక్కుతున్నారు. ఎమ్మెల్యేతో పనేంటి..ఆమె మంత్రి అయితే మాకేంటీ అంటున్నారు. రోజా ఆస్ట్రేలియా ట్రిప్ లో ఉన్న సమయంలో నగరి నియోజవర్గంలోని వైసీపీ నేతలు..మరింతగా రోజా లేకుండానే కార్యక్రమాలు నిర్వహించారు.

పార్టీ కార్యక్రమాలు చేయాలంటే రోజాతో పనిలేదు..అంటున్నారు నిండ్ర నుంచి రెడ్డివారి చక్రపాణిరెడ్డి, పుత్తూరు నుంచి అమ్ములు,నగరి నుంచి కేజే కుమార్, శాంతి దంపతులు. అలాగే వడమాల పేట, విజయపురం, నుంచి మురళీధర్ రెడ్డి, లక్ష్మీపతి ఇలా పలువరు నేతలు వచ్చే ఎన్నికల్లో టికెట్ తమలో ఒకరికి ఇవ్వాలని పట్టుపడుతున్నారు. స్థానికులకే వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వాలని అధినేత దృష్టికి తీసుకెళ్ళామని.. జగన్ రెడ్డి నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు.

తామంతా సపోర్ట్ చేస్తేనే రోజా నగరిలో గెలిచారన్నారు పుత్తూరు వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ అమ్ములు. రోజాకు పెద్ద మెజారిటీ ఏమీ రాలేదని.. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎప్పుడూ రోజా ప్రజలకు అందుబాటులో లేరన్నారు. ఐదుమండలాల్లో ఉన్న ముఖ్య నేతలకు ఎవరికి సీటిచ్చినా కలిసి పనిచేస్తామన్నారు. రోజా వెనుక వైఎస్సార్‌సీపీ కార్యకర్తలెవరూ లేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి రోజా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఇదే సమయంలో సొంత పార్టీ కార్యకర్తలు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. చాలా రోజులుగా నగరి వైఎస్సార్‌సీపీలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు నేరుగా మంత్రిని టార్గెట్ చేయడం ఆసక్తికరంగా మారింది.