నాకే ఎదురుచెబుతావా? వైద్యాధికారిపై కలెక్టర్ ఫైర్.. అరెస్ట్‌కు ఆదేశాలు

  • Published By: sreehari ,Published On : September 10, 2020 / 08:31 PM IST
నాకే ఎదురుచెబుతావా? వైద్యాధికారిపై కలెక్టర్ ఫైర్.. అరెస్ట్‌కు ఆదేశాలు

గుంటూరు జిల్లా నర్సరావుపేటలో కరోనాపై సమీక్షలో గందరగోళం ఏర్పడింది. వైద్య సిబ్బంది పనితీరు పట్ల జిల్లా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమను తప్పు పట్టడం సరికాదని నాదేండ్ల వైద్యాధికారి సోమ్లా నాయక్ కలెక్టర్‌కు బదులిచ్చారు. మీరు ఎవరూ చెప్పడానికి అని కలెక్టర్‌ను ఎదురు ప్రశ్నించాడు.. దాంతో సోమ్లూ నాయక్‌పై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.



నాకే ఎదురు చెబుతావా.. వైద్యాధికారిని అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు హుకుం జారీ చేశారు. స్లోమ్లా నాయక్‌ను సస్పెండ్ చేయాలంటూ జిల్లా వైద్యాధికారికి ఆదేశాలు జారీ చేశారు.



కలెక్టర్ తీరుతో వైద్యాధికారులంతా ఒక్కసారిగా కంగు తిన్నారు. తమను తక్కువ చేసి మాట్లాడారని వైద్యాధికారి ఆవేదన వ్యక్తం చేశారు.