Half Day Schools: ఎండల ఎఫెక్ట్.. ఏపీలో 24వరకు ఒంటిపూట బడులు..

ఏపీలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 24 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

Half Day Schools: ఎండల ఎఫెక్ట్.. ఏపీలో 24వరకు ఒంటిపూట బడులు..

AP Schools

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత తగ్గడం లేదు. రుతుపవనాల ప్రవేశం ఆలస్యం కావడంతో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికితోడు తీవ్రస్థాయిలో వడగాల్పులతో ప్రజలు మధ్యాహ్నం సమయంలో బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 43డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 24వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక తీసుకుంది.

Half Day Schools : మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు, ప్రభుత్వం ఉత్తర్వులు.. టైమింగ్స్ ఇవే

వేసవి సెలవుల అనంతరం జూన్ 12 నుంచే పాఠశాలలు రీ ఓపెన్ అయ్యాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం కారణంగా ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. రుతుపవనాల ఆలస్యం కారణంగా ఎండల తీవ్రత తగ్గకపోవటంతో ఈనెల 24వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ తెలిపింది. ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకు మాత్రమే పాఠాలు బోధించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకు రాగిజావ పంపిణీ చేయాలని సూచించింది. ఉ. 11.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.