Heavy Rain Forecast : తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..తెలంగాణలో 10 జిల్లాలకు రెడ్ అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో వానల బీభత్సం కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలంగాణలో 10 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలోనూ మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా తెలంగాణలో ఈ మూడు రోజులూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Heavy Rain Forecast : తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..తెలంగాణలో 10 జిల్లాలకు రెడ్ అలర్ట్

Heavy Rains

Heavy rain forecast : వరుణుడు వదలడం లేదు, వరదలు ఆగడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో వానల బీభత్సం కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలంగాణలో 10 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలోనూ మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా తెలంగాణలో ఈ మూడు రోజులూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

వచ్చే నాలుగు వారాల పాటు తెలంగాణలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, హైదరాబాద్‌ పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలో ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, మహబూబాబాద్‌, ఉమ్మడి వరంగల్ జిల్లాలున్నాయి.

Heavy Rains : తెలంగాణలో మరో నాలుగు రోజులు అతి భారీ వర్షాలు

ఇక మరో 12 జిల్లాలకు ఆరెంజ్‌, ఇంకో 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. తెలంగాణ వాతావరణంలో మార్పుల కారణంగా అప్పటికప్పుడు కారు మేఘాలు కమ్ముకుని కుండపోత వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలోనే ఇవాళ, రేపు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది.

మరోవైపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. అలర్ట్‌గా ఉండాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి పరీక్షా సమయమని.. కష్టకాలంలో ప్రజలను కాపాడుకునేందుకు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు.

Heavy Rain : తెలంగాణలో మళ్లీ జోరు వానలు..హైదరాబాద్ లో భారీ వర్షం

ఇక ఏపీలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవొచ్చని వెల్లడించింది. కోస్తా ప్రాంతం, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అన్నారు.