IMD alerts: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాబోయే 48 గంటలు భారీ వర్షాలు!!

బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య ప్రాంతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడింది.

IMD alerts: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాబోయే 48 గంటలు భారీ వర్షాలు!!

Ap Rains

IMD alerts: బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య ప్రాంతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడింది. ఫలితంగా కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురవనున్నట్లు హెచ్చరించింది వాతావరణశాఖ. రాబోయే 48 గంటలు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలను అనుకుని అల్పపీడనం కొనసాగుతున్నట్లుగా వాతావరణశాఖ చెబుతోంది.

ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షలు కురిసే అవకాశం ఉందని, కోస్తాలో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉండగా.. తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. మత్స్యకారుల వేటపై నిషేధం విధించినట్టు అధికారులు వెల్లడించారు.

వాతావరణశాఖ అల్పపీడన హెచ్చరికలతో తూర్పు గోదావరి ప్రాంతంలో యంత్రాంగం అలెర్ట్ అయ్యింది. జిల్లాలోని 13 తీర ప్రాంతాల ప్రజలపై అల్పపీడన ప్రభావం ఉందని, రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 9 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు అధికారులు.