APSRTC: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపు.. ఏపీకి కలిసొచ్చింది..

ఏపీఎస్ఆర్టీసీ సోమవారం భారీగా ఆదాయం సమకూరించింది. సోమవారం ఒక్కరోజే రూ.18.33 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు ఎపిఎస్ ఆర్టిసి ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ప్రయాణికుల రద్దీ కారణంగా మంగళవారం పలు ప్రాంతాల్లో అదనపు బస్సులు నడిపినట్లు బ్రహ్మానందరెడ్డి తెలిపారు. తిరుమల - తిరుపతి మధ్య అత్యధికంగా బస్సు సర్వీసులు తిప్పినట్లు ఆయన తెలిపారు.

APSRTC: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపు.. ఏపీకి కలిసొచ్చింది..

Apsrtc

APSRTC: ఏపీఎస్ఆర్టీసీకి సోమవారం భారీగా ఆదాయం సమకూరింది. సోమవారం ఒక్కరోజే రూ.18.33 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు ఎపిఎస్ ఆర్టిసి ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ప్రయాణికుల రద్దీ కారణంగా మంగళవారం పలు ప్రాంతాల్లో అదనపు బస్సులు నడిపినట్లు బ్రహ్మానందరెడ్డి తెలిపారు. తిరుమల – తిరుపతి మధ్య అత్యధికంగా బస్సు సర్వీసులు తిప్పినట్లు ఆయన తెలిపారు. తిరుమలకు రోజూ 2400 ట్రిప్పుల వరకు బస్సులు నడుపుతుండగా, సోమవారం 2,852 ట్రిప్పులు ఏపీ ఆర్టీసీ నడిపించింది. దీంతో తిరుపతి జిల్లాలో సోమవారం 84శాతం ఓఆర్ నమోదు చేసి రూ. 1.75 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు ఎపిఎస్ ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు.

APSRTC : ఆర్టీసీ బస్సుల్లో త్వరలో డిజిటల్ చెల్లింపులు

టీఎస్ఆర్టీసీ చార్జీలు పెంచడం వల్ల ఎపీఎస్ ఆర్టీసీకి ఆదాయం పెరిగిందని బ్రహ్మానందరెడ్డి అన్నారు. తెలంగాణ బస్సుల్లో చార్జీలు పెంచడం వల్ల ఎపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల ఆదరణ పెరిగిందని అన్నారు. విజయవాడ-హైదరాబాద్ మధ్య తిరిగే ఎపీ బస్సులు రద్దీగా ఉంటున్నాయని, పెరిగిన ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని బస్సులను తిప్పుతున్నట్లు తెలిపారు. తెలంగాణ బస్సుల మాదిరిగా ఏపీ బస్సుల్లో చార్జీలు పెంచకపోవడం వల్ల ఆదరణ పెరిగిందని అన్నారు. విజయవాడ- హైదరాబాద్ మార్గంలో రోజుకు రూ. 4నుండి 5 లక్షల వృద్ధి కనిపిస్తోందని, ఏపీఎస్ఆర్టీసీ లో చార్జీలు పెంచకపోవడం వల్ల ప్రయాణికులు ఆదరిస్తున్నారని అన్నారు.