Jagananna Vidya Deevena Money : సీఎం జగన్ గుడ్‌న్యూస్.. రేపే ఖాతాల్లోకి డబ్బులు

జగనన్న విద్యాదీవెన పథకం కింద బుధవారం (మార్చి 16) విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయనుంది.(Jagananna Vidya Deevena Money)

Jagananna Vidya Deevena Money : సీఎం జగన్ గుడ్‌న్యూస్.. రేపే ఖాతాల్లోకి డబ్బులు

Jagananna Vidya Deevena Money : ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. జగనన్న విద్యాదీవెన పథకం కింద బుధవారం (మార్చి 16) విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయనుంది. ఈ పథకం కింద ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తోంది. క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తోంది. అక్టోబర్‌-డిసెంబర్ 2021 త్రైమాసికానికి దాదాపు 10.82 లక్షల మంది విద్యార్ధులకు రూ.709 కోట్లు బుధవారం సచివాలయంలో సీఎం జగన్‌ బటన్‌ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

జగనన్న విద్యా దీవెన పథకం కింద.. దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన పేద విద్యార్ధులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తోంది ప్రభుత్వం‌. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజు మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం అయిన వెంటనే విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది జగన్‌ ప్రభుత్వం. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కింద ఇప్పటివరకు జగన్‌ ప్రభుత్వం చెల్లించిన మొత్తం రూ.9,274 కోట్లు. గత ప్రభుత్వం పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ. 1,778 కోట్లు కూడా వైసీపీ ప్రభుత్వమే చెల్లించింది.

ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో జగనన్న విద్యాదీవెన పథకం ఒకటి. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ అందించే పథకాన్ని జగనన్న విద్యాదీవెన పథకంగా ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకం ద్వారా స్కాలర్ షిప్ నగదును నేరుగా తల్లుల ఖాతాలో జమ చేస్తోంది. ప్రతి ఏటా లక్షలాది మంది విద్యార్థులకు విద్యాదీవెన ద్వారా లబ్ధి చేకూరుతుంది.

విద్యాదీవెన పథకం వెనుక ఆ విద్యార్థి ఆత్మ‌హ‌త్య.. అసలేం జరిగిందో చెప్పిన సీఎం జగన్

గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 8న విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి ఈ ఏడాదికి సంబంధించిన ఫీజు డబ్బులు పడాలి. మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం కావడంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. దీంతో విద్యాదివెన నగదు జమ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు.

జగనన్న విద్యా దీవెన పథకం కింద అర్హులైన విద్యార్థులకు ప్రతి విద్యా సంవత్సరంలో నాలుగు విడతలుగా పూర్తి ఫీజురీయింబర్స్ అందిస్తోంది. ఇప్పటివరకు రూ.6,259 కోట్లను ప్రభుత్వం విద్యార్థులకు అందజేసింది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తోంది.

ఈ విద్యాసంవత్సరంలో 2021 ఏప్రిల్ 19న మొదటి విడత నగదు విడుదల చేసిన ప్రభుత్వం.. జూలై 29న రెండో విడత మొత్తాన్ని ఖాతాల్లో వేసింది. నవంబ్ 3వ తేదీన నాలుగో విడత నగదు విద్యార్థలకు అందాయి. తాజాగా మార్చి 8న నాలుగో విడత నగదు జమ చేసేందుకు ఏర్పాట్లు చేయగా.. మహిళా దినోత్సవం సందర్భంగా వాయిదా పడింది.(Jagananna Vidya Deevena Money)