Jagan : వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఏకగ్రీవ ఎన్నిక

ఈ మహా సైన్యానికి సెల్యూట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీని గట్టి పునాదుల మీద నిర్మించుకున్నామని తెలిపారు. 2009 సెప్టెంబర్ 2న నాన్న అనూహ్యంగా మరణించారని తెలిపారు. నాన్న మరణంతో 700 మంది చనిపోయారని పేర్కొన్నారు.

Jagan : వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఏకగ్రీవ ఎన్నిక

Jagan

YCP Jagan : వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జగన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రకటించారు. వైఎస్ విజయమ్మ పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికీ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్లీనరీ ఆత్మీయుల సునామీలా కనిపిస్తోందన్నారు. త్యాగాలు చేసిన సైన్యం ఇక్కడ ఉందని చెప్పారు.

ఈ మహా సైన్యానికి సెల్యూట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీని గట్టి పునాదుల మీద నిర్మించుకున్నామని తెలిపారు. 2009 సెప్టెంబర్ 2న నాన్న అనూహ్యంగా మరణించారని తెలిపారు. నాన్న మరణంతో 700 మంది చనిపోయారని పేర్కొన్నారు. ఆ కుటుంబాలను పరామర్శించడానికి కూడా తనకు వీలు లేదన్నారు. టీడీపీ, కాంగ్రెస్ రెండూ కలిసి తనపై కేసులు వేశాయని తెలిపారు. దేశంలో శక్తివంతమైన వ్యవస్థలను తనపైకి ఉసిగొల్పారని చెప్పారు.

CM Jagan Request : ప్రత్యేక హోదా ఇవ్వండి.. అల్లూరి సాక్షిగా ప్రధాని మోదీకి సీఎం జగన్ విజ్ఞప్తి

కుట్రలు, కేసులకు తాను లొంగలేదన్నారు. ఒక్క ఎమ్మెల్యేతో ప్రారంభమైన ప్రయాణం.. 151 కి చేరిందని చెప్పారు. 2014 ఎన్నికల్లో 45 శాతం ఓట్లు వచ్చి ఒక్క శాతం ఓట్ల తేడాతో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. 2014లో కూడా మళ్లీ అవే కుట్రల చేశారని పేర్కొన్నారు. 67 మంది ఎమ్మెల్యేల్లో 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారని మండిపడ్డారు. తనను టార్గెట్ చేసిన పార్టీ నామరూమాల్లేకుండా పోయిందన్నారు.