CM Jagan Request : ప్రత్యేక హోదా ఇవ్వండి.. అల్లూరి సాక్షిగా ప్రధాని మోదీకి సీఎం జగన్ విజ్ఞప్తి

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్ కోరారు. పోలవరం ప్రాజెక్టుకి సవరించిన అంచనాల ప్రకారం రూ.55వేల కోట్లకు పైగా నిధులకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీకి రావాల్సిన రూ.6వేల కోట్లకు పైగా నిధులను ఇప్పించాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు.

CM Jagan Request : ప్రత్యేక హోదా ఇవ్వండి.. అల్లూరి సాక్షిగా ప్రధాని మోదీకి సీఎం జగన్ విజ్ఞప్తి

Cm Jagan

CM Jagan Request : భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు హాజరైన ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ వినతిపత్రాన్ని అందజేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్ కోరారు. రాష్ట్ర విభ‌జ‌న వ‌ల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా తీవ్రంగా న‌ష్టపోయింద‌న్న జ‌గ‌న్‌… ఆ న‌ష్టాన్ని భ‌ర్తీ చేసేందుకు గాను రీసోర్స్ గ్యాప్ గ్రాంట్ కింద రూ.34,125 కోట్ల‌ను విడుద‌ల చేయాల‌ని మోదీని కోరారు. అదే విధంగా పోల‌వ‌రం ప్రాజెక్ట్ స‌వ‌రించిన అంచ‌నాలు రూ.55వేల 548 కోట్లకు ఆమోదం తెల‌పాల‌ని ప్ర‌ధానిని కోరారు జగన్. అటు ఏపీకి తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన రూ.6,627 కోట్ల‌ను ఇప్పించాల‌ని విజ్ఞప్తి చేశారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఇక జాతీయ ఆహారభద్రత చట్టం కింద రాష్ట్రానికి ఇస్తున్న రేషన్ లో హేతుబద్ధత లేదన్న సీఎం జగన్.. దీనివల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతోందన్న విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు జగన్. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలకు ఆర్థిక సాయం చేయాలని, భోగాపురం ఎయిర్ పోర్టుకు క్లియరెన్స్ లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు జగన్. అటు ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలని ప్రధానిని కోరారు సీఎం జగన్.

Andhra Pradesh: అందుకే అల్లూరి సీతారామరాజు పేరును జిల్లాకు పెట్టాం: సీఎం జగన్

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని భీమ‌వ‌రంలో ఏర్పాటు చేసిన అల్లూరి విగ్ర‌హావిష్క‌ర‌ణ కోసం సోమ‌వారం ఏపీకి వ‌చ్చిన ప్ర‌ధాని మోదీ.. ఢిల్లీకి తిరుగు పయనం అవుతున్న స‌మ‌యంలో సీఎం జగన్ ఓ విన‌తి ప‌త్రం అందించారు. ఈ విన‌తి ప‌త్రంలో రాష్ట్రానికి సంబంధించిన ప‌లు కీల‌క అంశాలున్నాయి. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డంతో పాటు రాష్ట్ర విభ‌జ‌న‌తో తీవ్రంగా న‌ష్ట‌పోయిన ఏపీని ఆదుకునే దిశ‌గా మ‌రింత మేర సాయం చేయాలంటూ ఆ విన‌తి ప‌త్రంలో మోదీని కోరారు జగన్.

Modi: యావత్ భార‌త్ త‌ర‌ఫున అల్లూరికి పాదాభివంద‌నం చేస్తున్నాను: మోదీ

మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు విగ్ర‌హావిష్క‌ర‌ణ ఏపీలోని భీమ‌వ‌రంలో ఘ‌నంగా జ‌రిగింది. భార‌త ప్ర‌ధాని మోదీ… అల్లూరి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్రమానికి ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌లు హాజ‌ర‌య్యారు. ఇక భీమ‌వ‌రం స‌మీపంలోని మొగ‌ల్తూరులో జ‌న్మించిన టాలీవుడ్ మెగాస్టార్‌, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.