devineni uma: ‘సీఎఫ్ఎంఎస్‌లో పేమెంట్ల విధానంపై విచారణ జరిపితే జగన్ జైలుకెళ్లడం ఖాయం’

Devineni
devineni uma: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ తీవ్ర విమర్శలు చేశారు. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్) నుంచి ఆఫ్ లైన్ పేమెంట్లు జరుగుతున్నాయంటూ దేవినేని ఉమ ఆరోపించారు. సీఎఫ్ఎంఎస్‌లో జరుగుతున్న పేమెంట్ల విధానంపై విచారణ జరిపితే జగన్ జైలుకెళ్లడం ఖాయమని ఆయన అన్నారు. సీఎఫ్ఎంఎస్ సిస్టం నుంచి ఆఫ్ లైన్ పేమెంట్లు చేస్తున్నారని, రూ.1 లక్ష కోట్ల బిల్లులు చెల్లిస్తే.. అందులో సజ్జల గిల్లుడే రూ.20 వేల కోట్లుగా ఉందని ఆయన ఆరోపించారు.
సీఎఫ్ఎంఎస్ విధానాన్ని మంచి కోసం ప్రవేశపెడితే ఆ వ్యవస్థనే భ్రష్టు పట్టించారని ఆయన అన్నారు. కాగ్ అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదని ఆయన నిలదీశారు. తమ పార్టీ నేత చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించారని, ఇప్పుడు ఆయనకు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని దేవినేని అన్నారు. ఇప్పటికే వైసీపీ సర్కారు చాలా మంది నేతలపై తప్పుడు కేసులు పెట్టించి జైళ్లకు పంపిందని ఆయన చెప్పారు.
Odisha: ఒడిశా మంత్రులుగా 13 మంది ప్రమాణ స్వీకారం
తాము ప్రాణాలకు తెగించి ప్రభుత్వంతో పోరాడుతున్నామని దేవినేన అన్నారు. ఉద్యోగస్థుల భవనాన్ని సజ్జల ఏం హోదాలో ప్రారంభోత్సవం చేశారని ఆయన నిలదీశారు. సజ్జలకు సిగ్గుందా? అని ఆయన అన్నారు. ఏపీలో మామిడికాయ పచ్చడి పెట్టుకునే యోగ్యం కూడా లేదని, గతంలో100 కాయలతో పచ్చడి పెట్టుకునే వారు ధరలు పెరిగిపోవడంతో ఇప్పుడు 50 కాయలతోనే పచ్చడి పెట్టుకుంటున్నారని ఆయన చెప్పారు. పచ్చికారం, నూనెల ధరల కూడా పెరిగాయని ఆయన అన్నారు.