Odisha: ఒడిశా మంత్రులుగా 21 మంది ప్ర‌మాణ స్వీకారం

 ఒడిశాలో పున‌ర్వ్య‌వ‌స్థీక‌రించిన కేబినెట్‌ కొలువుదీరింది. భువ‌నేశ్వ‌ర్‌లోని లోక్‌సేవ భ‌వ‌న్ న్యూ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో మొత్తం 21 మంది ఎమ్మెల్యేలతో మంత్రులుగా ఆదివారం గణేశీ లాల్‌ ప్ర‌మాణ స్వీకారం చేయించారు.

Odisha: ఒడిశా మంత్రులుగా 21 మంది ప్ర‌మాణ స్వీకారం

Odisha Cabinet

Odisha:  ఒడిశాలో పున‌ర్వ్య‌వ‌స్థీక‌రించిన కేబినెట్‌ కొలువుదీరింది. భువ‌నేశ్వ‌ర్‌లోని లోక్‌సేవ భ‌వ‌న్ న్యూ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో మొత్తం 21 మందితో మంత్రులుగా ఆదివారం ఒడిశా గవర్నర్ గణేశీ లాల్‌ ప్ర‌మాణ స్వీకారం చేయించారు. 21 మందిలో 13 మంది కేబినెట్, మరో ఎనిమిది మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. కేబినెట్ పున‌ర్వ్య‌వ‌స్థీక‌రణ నేప‌థ్యంలో ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ శ‌నివారం మంత్రుల‌ను రాజీనామా చేయాల‌ని ఆదేశించిన విష‌యం తెలిసిందే. దీంతో ఆ వెంటనే 20 మంది మంత్రులు రాజీనామా చేశారు.

Biden: గ‌గ‌న‌త‌ల నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తూ వ‌చ్చిన విమానం.. సుర‌క్షిత ప్రాంతానికి అమెరికా అధ్య‌క్షుడు బైడెన్

ఆదివారం మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేసిన బీజేడీ పార్టీ ఎమ్మెల్యేల్లో ఎస్.జ‌గ‌న్నాథ్‌, నిరంజ‌న్ పుజారీ, ఆర్పీ స్వాయిన్ కూడా ఉన్నారు. అలాగే, మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేసిన వారిలో ఐదుగురు మ‌హిళ‌లు ఉన్నారు. ఒడిశా అసెంబ్లీ స్పీక‌ర్ ప‌ద‌వికి ఎస్ఎన్ పాత్రో కూడా రాజీనామా చేశారు. కాగా, ఒడిశాలో 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఒడిశాలో రెండు దశాబ్దాలకు పైగా నవీన్ పట్నాయక్ ప్రభుత్వమే కొనసాగుతోంది. దీంతో సాధారణంగా ప్రజల్లో ఉండే ప్రభుత్వ వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని నవీన్ పట్నాయక్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేసినట్లు తెలుస్తోంది.