CM Jagan: నేడు జగనన్న చేదోడు నిధుల విడుదల.. పల్నాడులో విడుదల చేయనున్న సీఎం జగన్

మూడో విడత జగనన్న చేదోడు నిధుల విడుదల కార్యక్రమం పల్నాడు (వినుకొండ)లో సోమవారం జరగనుంది. ఈ పథకం కింద దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు రూ.10 వేల సాయం అందుతోంది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 3,30,145 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది.

CM Jagan: నేడు జగనన్న చేదోడు నిధుల విడుదల.. పల్నాడులో విడుదల చేయనున్న సీఎం జగన్

CM Jagan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘జగనన్న చేదోడు’ పథకం కింద నిధులు నేడు విడుదల కానున్నాయి. మూడో విడత జగనన్న చేదోడు నిధుల విడుదల కార్యక్రమం పల్నాడు (వినుకొండ)లో సోమవారం జరగనుంది. ఈ పథకం కింద దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు రూ.10 వేల సాయం అందుతోంది.

Budget Session: రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్న ప్రభుత్వం

మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 3,30,145 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. మొత్తం రూ.330.15 కోట్ల రూపాయల్ని ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేస్తోంది. ఈ మూడేళ్లలో ఈ పథకం ద్వారా మొత్తం రూ.927.51 కోట్ల నిధుల్ని అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. 2020-21లో రూ.298.12 కోట్లు, 2021-22లో రూ.299 కోట్లు, 2022-23లో రూ.330.15 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ప్రతి లబ్ధిదారుడికి మూడేళ్లలో రూ.30,000 సాయం అందింది. షాపులున్న రజకులు, టైలర్లు, నాయీ బ్రాహ్మణులకు ఈ పథకం ద్వారా నిధులు అందుతాయి. నిధుల్ని లబ్ధిదారులకు విడుదల చేసే కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహిస్తున్నారు.

Australia: ఖలిస్తాన్ మద్దతుదారుల అరాచకం.. ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడి

సీఎం జగన్ ఉదయం తాడేపల్లి నుంచి బయల్దేరి హెలికాప్టర్ ద్వారా వినుకొండ చేరుకుంటారు. అక్కడ హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి సమీపంలోని వైఎస్సార్ స్టేడియానికి రోడ్డు మార్గంలో వెళ్తారు. అక్కడ జరిగే బహిరంగ సభలో బటన్ నొక్కి సీఎం నిధులు విడుదల చేస్తారు. దీంతో లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమవుతాయి. మరోవైపు సీఎం పర్యటన సందర్భంగా వినుకొండలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.