Amaravati Capital: అమరావతి రాజధాని కోసం ఢిల్లీకి పాదయాత్ర
అమరావతి రాజధాని కోసం శ్రీకాకుళం చెందిన యువకుడు ఢిల్లీకి పాదయాత్రగా వెళ్లాడు. అమరావతి నుంచి బయల్దేరి 41రోజుల పాటు ప్రయాణించాడు శేఖర్ అనే వ్యక్తి.

Delhi Ap Bhavan
Amaravati Capital: అమరావతి రాజధాని కోసం శ్రీకాకుళం చెందిన యువకుడు ఢిల్లీకి పాదయాత్రగా వెళ్లాడు. అమరావతి నుంచి బయల్దేరి 41రోజుల పాటు ప్రయాణించాడు శేఖర్ అనే వ్యక్తి.
రాష్ట్రాన్ని మోదీ కాపాడాలి, అమరావతిని అభివృద్ధి చేయాలి అనే నినాదంతో పాదయాత్ర చేశానని యువకుడు వెల్లడించాడు. తనతో పాటుగా మోడీ, పవన్ కల్యాణ్ కలిసి ఉన్న ఫ్లెక్సీతో ప్రయాణించి ఢిల్లీ ఏపీ భవన్ చేరుకున్నాడు.
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చి భారత్‌ను అభివృద్ధి చేస్తున్న మోడీ వల్లనే ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందని భావిస్తున్నట్లు చెప్పాడు. ఢిల్లీలో ప్రధానిని తప్పకుండా కలిసి తీరతానని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఈ జనసేన కార్యకర్త.