Pawan Kalyan On Jagan Government : ప్రభుత్వం మారకపోతే ఆంధ్రలో అంధకారమే-పవన్ కల్యాణ్ సంచలనం

ఏపీలో ప్రభుత్వం మారకపోతే, రాష్ట్రంలో అంధకారమే అని హెచ్చరించారు పవన్. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకుండా చూస్తానని శపథం కూడా చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్. (Pawan Kalyan On Jagan Government)

Pawan Kalyan On Jagan Government : ప్రభుత్వం మారకపోతే ఆంధ్రలో అంధకారమే-పవన్ కల్యాణ్ సంచలనం

Pawan Kalyan On Jagan Government : జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. జగన్ సర్కార్ లక్ష్యంగా నిప్పులు చెరిగారు. ఈసారి విమర్శల్లో బాగా డోస్ పెంచారు పవన్ కల్యాణ్. వైసీపీని దింపుతా, ముఖ్యమంత్రిని అవుతా అంటూ హాట్ కామెంట్స్ చేశారు పవన్ కల్యాణ్. ఏపీలో ప్రభుత్వం మారకపోతే, రాష్ట్రంలో అంధకారమే అని హెచ్చరించారు పవన్. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకుండా చూస్తానని శపథం కూడా చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్.

Also Read..Pawan Kalyan : వైసీపీని దింపుతా, ముఖ్యమంత్రిని అవుతా-పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా పోరాటం చేసి కొత్త ప్రభుత్వాన్ని తీసుకురాకపోతే కనుక ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది, అంధకారంలోకి పోతుంది అని పవన్ తీవ్రంగా హెచ్చరించారు. నేను విదేశాలకు పారిపోయే వాడిని కాదన్నారు పవన్ కల్యాణ్. నేను ఇక్కడే ఉండేవాడిని అని అన్నారు. అధికారం చూసిన కులాల మీద తనకు వ్యతిరేకత లేదన్నారు పవన్.

”ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులను కలిపి ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వాన్ని స్థాపించడం నా లక్ష్యం. అందులో నన్ను ముఖ్యమంత్రిని చేస్తారా లేదా అన్నది మీ అందరి గుండెచప్పుడు బలంగా ఉంటే నేను ముఖ్యమంత్రి అవుతా. మీ అందరూ కోరుకుంటే నేను సీఎం అవుతా. నిజంగా చెప్పాలంటే నాకు వైసీపీతో గొడవలేదు. మీరు కనుక సమర్థవంతంగా పరిపాలించి, ఉద్యోగాలు ఇచ్చి ఉంటే.. నేను ఇంత గొడవ చేసే వాడిని కాదు. భనవ నిర్మాణ కార్మికుల సెస్ ఫండ్ కనుక మీరు క్లోజ్ చేసి ఉండకపోతే నేను రోడ్ల మీదకు వచ్చే వాడిని కాదు. రైతాంగానికి కనుక మీరు గిట్టుబాటు ధర ఇచ్చి ఉంటే ఇవాళ నేను రోడ్డు మీదకు వచ్చే వాడిని కాను” అని పవన్ కల్యాణ్ అన్నారు.

Also Read..Janasena ‘Varahi’ : వాహన చట్టం గురించి తెలియని సన్నాసులు ఏపీలో మమ్మల్ని ఎలా తిరగనివ్వరో చూస్తాం : నాగబాబు

”మీరు నోరు పారేసుకుంటే నేను నోటికి పని చెప్తా. నన్ను పీకేస్తే మళ్లీ మొలుస్తా. మీరు తొక్కేస్తే మళ్లీ లేస్తా. కాపు నేతలతో నన్ను బూతులు తిట్టిస్తున్నారు. బీసీ హాస్టళ్లతో చారు మట్టి నీళ్లతో సమానం. బీసీ సాధికారత అంటే.. హాస్టళ్లలో సౌకర్యాలు పెంచడం, ఫీజు రీయింబర్స్ మెంట్ చేయడం. బిర్యానీకి, రొయ్యల వేపుడుకు బీసీలు అమ్ముడుపోరు. పెన్షన్ డబ్బులు కాజేసేంత నీచుడిని కాదు నేను. మీ అందరి గుండె చప్పుడు బలంగా ఉంటే ముఖ్యమంత్రిని అవుతా. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతోంది. వైసీపీ అధికారంలోకి రాకుండా చూసుకునే బాధ్యత నాది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోననే మాటకు కట్టుబడి ఉన్నా. బీజేపీకి, టీడీపీకి అమ్ముడుపోయే కర్మ నాకు లేదు” అని హాట్ కామెంట్స్ చేశారు పవన్.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.