Janasena ‘Varahi’ : వాహన చట్టం గురించి తెలియని సన్నాసులు ఏపీలో మమ్మల్ని ఎలా తిరగనివ్వరో చూస్తాం : నాగబాబు

వాహన చట్టం గురించి తెలియని సన్నాసులు ఏపీలో మమ్మల్ని ఎలా తిరగనివ్వరో చూస్తాం అంటూ జనసేన నేత నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Janasena ‘Varahi’ : వాహన చట్టం గురించి తెలియని సన్నాసులు ఏపీలో మమ్మల్ని ఎలా తిరగనివ్వరో చూస్తాం : నాగబాబు

Janasena 'Varahi'

Janasena ‘Varahi’ : జనసేన ఎన్నికల ప్రచారం రథం ‘వారాహి‘వాహనంపై వస్తున్న విమర్శలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు,జనసేన నేత నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాహన చట్టం గురించి తెలియని సన్నాసులు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని..ఏపీలో తిరగనివ్వం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని మమ్మల్ని ఏపీలో ఎలా తిరగనివ్వరో చూస్తాం అంటూ నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ‎లో చేరి ఉంటే పవన్ కల్యాణ్‌ ఎప్పుడో సెంట్రల్ మినిస్టర్ అయ్యేవాడని కాదని అధికారం కోసం పాకులాడే వ్యక్తి పవన్ కాదని గత 30 ఏళ్ల క్రితం నా తమ్ముడు ఎలా ఉన్నాడో..ఇప్పుడు కూడా అలాగేఉన్నాడని డబ్బుల కోసం..పదవుల కోసం వెంపర్లాడేవాడు కాదనిస్పష్టంచేశారు.

కానీ ప్రజల కోసం పార్టీ పెట్టిన పవన్ కేవలం పదవుల కోసం ఆశపడి రాజకీయాల్లోకి రాలేదని ప్యాకేజీ స్టార్ అంటూ పవన్ పై విమర్శలు చేయటం బాధాకరమని అన్నారు నాగబాబు. పదవుల కోసం ఆశపడి ఉంటే బీజేపీలోనే చేరేవాడని అలా చూసుకుంటే పవన్ ఇప్పటికే సెంట్రల్ మినిస్టర్ అయి ఉండేవాడని అన్నారు. సినిమాల్లో పవన్ కు కోట్లు కురుస్తాయి. సినిమాల్లో కష్టపడి సంపాదించిన  డబ్బంతా పట్టుకొచ్చి జనసేన పార్టీకే పెట్టాడు. ఆఖరికి పిల్లల చదువుల కోసం దాచిన డబ్బులు కూడా పార్టీ కార్యక్రమాల కోసమే పెడుతున్నాడని అటువంటి పవన్ కల్యాణ్ నియంతృత్వ ప్రభుత్వ పోకడటంతో అన్యాయమైపోతున్న ప్రజల కోసం ఏదైనా చేయాలనే రాజకీయాల్లోకి వచ్చాడని..కరడు కట్టిన కర్కశత్వం కలిగిన గూండాల్లాంటి రాజకీయ నాయకులతో పోరాడుతున్నాడని తెలిపారు. తన తమ్ముడి పవన్ కల్యాణ్ ను చూసి తమ కుటుంబం అంతా గర్వపడుతుందని అన్నారు నాగబాబు.

కాగా వారాహి వాహనం రంగుపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఈ వాహనం రంగు ఆర్మీ రంగులో ఉందని చేతిలో డబ్బులుంటే ఇష్టమొచ్చిన వాహనాలు కొనేసుకుని ఇష్టమొచ్చిన రంగులు వేసుకుని తిరిగేస్తారా? ఇదేమన్నా సినిమానా? అంటూ వారాహి వాహన రంగుపై విమర్శలు చేశారు. కానీ ఈ విమర్శలకు చెక్ పెడుతూ తెలంగాణ రవాణశాఖ వారాహి వాహనానికి రిజిస్ట్రేషన్ చేసింది. ఈ వాహనానికి..రంగుకు..బాడీకి వాహనం చట్ట ప్రకారం ఎటువంటి అభ్యంతరాలు లేవని తేల్చి చెప్పింది. పైగా వారాహి వాహానినికి నేషనల్ పర్మిట్ కూడా ఇచ్చింది.

Janasena ‘Varahi’ : పవన్ కల్యాణ్ ఎన్నికల వాహనం ‘వారాహి’ రిజిస్ట్రేషన్‌కు అనుమతి..

అయినా వైసీపీ నేతలు మాత్రం వారాహిపై విమర్శలు చేస్తునే ఉన్నారు. వారాహి వాహనం తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయ్యిందని..ఏపీకి వస్తే తిరిగనిచ్చేది లేనిది అప్పుడు ఆలోచిస్తాం అంటూ మంత్రి అమర్నాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. వారాహి ఏపీలోకి రావటానికి ఏరంగు మార్చుకుంటుందో అని అన్నారు. దీంతో ఇప్పటికే పవన్ కల్యాణ్ అంటేనే ఇంతెత్తున ఎగిరిపడే వైసీపీ పలు విమర్శలు సంధిస్తోంది. పవన్ కల్యాణ్ సినిమాలకు టికెట్ రేట్లు తగ్గించి ఏపీలో వివాదం చేయటం, ఏపీలో పవన్ ఎక్కడ పర్యటించినా అడ్డుకోవటం..కేసులు పెట్టటం వంటివి చేయటంపై జనసేన మండిపడుతోంది. ఈక్రమంలోనే వారాహి వాహనంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆపార్టీ నేత నాగబాబు ఘాటు విమర్శలు చేశారు.

Janasena ‘Varahi’ Registration : పవన్ కల్యాణ్ ‘వారాహి‘ వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ TS13EX8384 : డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్

కాగా పవన్ కల్యాణ్ వారాహి వాహనం రిజిస్ట్రేషన వారం రోజుల క్రితమే పూర్తి అయ్యిందని స్వయంగా తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు తెలిపారు.పవన్ కల్యాణ్ ఎన్నికల వాహనం ‘వారాహి’కి వాహనం రిజిస్ట్రేషన్‌కు అనుమతి లభించటం..వాహనం రిజిస్ట్రేషన్ కూడా పూర్తి అయ్యింది.  ‘వారాహి’వాహనానికి రవాణాశాఖ చట్టం ప్రకారంగా అన్ని నిబంధలు ఉన్నాయని..వారాహి వాహనం రంగు ఎమరాల్డ్ గ్రీన్ అని స్పష్టంచేశారు కమిషనర్ పాపారావు. వాహనం బాడీ తయారీకి సంబంధించిన సర్టిఫికెట్ ను పరిశీలించామని..అన్ని నిబంధనలు ఉన్నాయిని వాహనం రిజిస్ట్రేషన్ కు చట్ట ప్రకారం ఎటువంటి అభ్యంతరాలు లేనందున వారాహి వాహనం రిజిస్ట్రేషన్ చేశామని ‘వారాహి’ రిజిస్ట్రేషన్ నెంబర్ TS13EX8384 అని తెలిపారు.