Pawan Kalyan Mourned : రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు : పవన్ కళ్యాణ్

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రోశయ్య మృతికి తన తరపున, జనసేన తరపున సంతాపం తెలుపుతున్నట్లు ప్రకటించారు.

Pawan Kalyan Mourned : రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు : పవన్ కళ్యాణ్

Pawan Kalyan

Pawan Kalyan mourned to the death of Rosaiah : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రోశయ్య మృతికి తన తరపున, జనసేన తరపున సంతాపం తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుఃఖ సమయంలో వారికి భగవంతుడు అండగా నిలవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. నిష్కళంక రాజకీయయోధుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించిన గొప్ప వ్యక్తి రోశయ్య అని కొనియాడారు.

రోశయ్యతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. ఆయన మరణం తనను తీవ్ర వేదనకు గురి చేసిందన్నారు. జనసేన పార్టీని స్థాపించిన తరువాత రెండు, మూడుసార్లు రోశయ్యను కలిశానని.. ఆయన తనకు ఎన్నో విలువైన సలహాలు అందించి ఎంతో అభిమానం చూపేవారని పేర్కొన్నారు. రాజకీయ రంగంలోకి ప్రవేశించిన అనతి కాలంలోనే 1968లో శాసనమండలి సభ్యునిగా ఎంపికైనది మొదలు ఆయన నిరంతరంగా చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తూనే వున్నారని తెలిపారు.

CM KCR Mourned : రోశయ్య మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

ఒకసారి శాసనసభకు మరోసారి పార్లమెంటుకు ఎన్నికై మూడు సభలలోనూ తనదైన శైలితో ప్రత్యేకతను చాటుకున్నారని కొనియాడారు. 1972లో మంత్రిగా పదవీ భాద్యతలు చేపట్టి ఎందరు ముఖ్యమంత్రులు మారినా మంత్రిమండలిలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారని వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవహారాలపై విశేషానుభవం కల్గిన రోశయ్య 15సార్లు రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించడం ఆయన ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు.

ఆ అనుభవం, ఆయనలోని విధేయత ఆయనను ముఖ్యమంత్రిగా నిలిపిందన్నారు. ఆపత్కాల సమయంలో 14 నెలలపాటు రోశయ్య ముఖ్యమంత్రిగా సేవలు అందించారని గుర్తు చేశారు. పాలనాపరంగా ఆయన చూపిన విజ్ఞత, వ్యవహారశైలిని తెలుగు ప్రజలు మరచిపోలేరని చెప్పారు. అనంతరం పొరుగు రాష్ట్రం తమిళనాడు గవర్నర్ గా పదవి బాధ్యతలు స్వీకరించి తమిళ ప్రజల ఆదరాభిమానాలను పొందడం ఆయనలో విశాల దృక్పథానికి నిదర్శనం అన్నారు.

Corona Cases : దేశంలో కొత్తగా 8,603 కరోనా కేసులు..415 మరణాలు

ఆయనలో వాక్పటిమ, చాతుర్యం ఆయనను ఒక విలక్షణ రాజకీయవేత్తగా నిలిపాయని తెలిపారు. సుదీర్ఘ కాలంపాటు ఉన్నత పదవులలో కొనసాగినా.. వేలెత్తి చూపలేని పాలన ఆయన సొంతమన్నారు. నీతి, నిజాయతీలతో రాజకీయ ప్రస్థానాన్ని ముగించిన రోశయ్య నేటి పాలకులకు నిస్సందేహంగా ఆదర్శప్రాయులని పేర్కొన్నారు.