Janasena Janavani : ప్రభుత్వాన్ని నిలదీసేలా.. జనసేన కొత్త కార్యక్రమం జనవాణి

ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసేలా, సామాన్యుడి గళం వినపడేలా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జనసేన పార్టీ. జనసేనాని స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపనున్నారు.

Janasena Janavani : ప్రభుత్వాన్ని నిలదీసేలా.. జనసేన కొత్త కార్యక్రమం జనవాణి

Janasena Janavani

Janasena Janavani : ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసేలా, సామాన్యుడి గళం వినపడేలా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జనసేన పార్టీ. జూలై 3న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రజల సమస్యలు ప్రభుత్వానికి తెలిపేలా జనవాణి కార్యక్రమం ఉంటుందని జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జనసేనాని స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపనున్నారు. జనసేన కార్యాలయం నుంచి అర్జీలను ఫాలోప్ చేస్తామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రతీ ఆదివారం జనవాణి కార్యక్రమం ఉంటుందన్నారు. తొలి రెండు ఆదివారాలు జనవాణి కార్యక్రమాలు విజయవాడలోనే జరుగుతాయన్నారు.

”ప్రజల సమస్యలను ఆసాంతం విని ప్రభుత్వానికి బలంగా తెలిపేలా జన వాణి కార్యక్రమం ఉంటుంది. బాధిత పక్షాల నుంచి స్వయంగా పవన్ కళ్యాణ్ అర్జీలు స్వీకరిస్తారు. కష్టాల్లో ఉన్న జన సామాన్యానికి జనసేన భరోసా ఇస్తుంది. జూలై 3న విజయవాడలో ‘జన వాణి’కి శ్రీకారం చుట్టబోతున్నాం.

Pawan Kalyan: దసరా తర్వాత వైసీపీ నాయకుల సంగతి చూస్తాం.. అప్పటి వరకు భరిస్తాం

రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేలా.. సామాన్యుడి గళం వినబడేలా జనసేన పార్టీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి ‘జనవాణి’ అనే పేరుని ఖరారు చేశారు పవన్ కల్యాణ్. వరుసగా వచ్చే ఐదు ఆదివారాలు ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉండి సమస్యలతో సతమతం అవుతున్న బాధిత పక్షాల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరిస్తారు” అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Janasena Nagababu : పవన్ నిప్పుల్లో దూకమంటే దూకాలి, 2024లో సీఎంగా చూసుకోవచ్చు-నాగబాబు

”గతంలో ప్రభుత్వాలు ప్రజల పక్షాన నిలబడి, ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే విధంగా కార్యక్రమాలు చేపట్టేవి. ముఖ్యమంత్రులు ప్రజల బాధలు విని అర్జీలు తీసుకునేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ముఖ్యమంత్రికి అర్జీ ఇచ్చే అవకాశం సామాన్యుడికి లేకుండా పోయింది. జిల్లాల్లో కలెక్టర్లు నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం తూతూ మంత్రంగా సాగుతోంది.

Pawan Kalyan Warns : ప్రభుత్వాలు మారతాయి.. గుర్తు పెట్టుకోండి- పవన్ వార్నింగ్

కనీసం ప్రజాప్రతినిధులు నిర్వహిస్తున్న గడప గడపకు కార్యక్రమంలోనైనా ప్రజా సమస్యలు విని, వాటిని పరిష్కారిస్తారంటే ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. గడప గడపకు కార్యక్రమంలో ఎవరైతే ప్రజాప్రతినిధులను సమస్యలపై నిలదీస్తున్నారో వాళ్లపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లా నుంచి ఒక వికలాంగ దళిత మహిళ తన స్థలాన్ని ఆక్రమించి వైసీపీ నాయకులు భవనం నిర్మించారని ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇద్దామని ప్రయత్నించి విఫలమైంది. ఆమె వస్తుంటే కలవనీయకుండా ఆటంకాలు కలిగించారు. ఇది తెలిసి చలించిపోయిన పవన్ కళ్యాణ్ ‘జనవాణి-జనసేన భరోసా’ కార్యక్రమాన్ని రూపొందించారు” అని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.