Janasena Pawan kalyan : కుమారుడ్ని కోల్పోయిన బాధిత మహిళకు రూ.4లక్షలు చెక్ అందించిన జనసేన

కుమారుడ్ని కోల్పోయిన బాధిత మహిళకు రూ.4లక్షలు చెక్ అందించింది జనసేన పార్టీ.కుమారుడ్ని పోగొట్టుకుని పరిహారంగా వచ్చిన డబ్బులో వాటా ఇవ్వాలని మంత్రి అంబటి రాంబాబు తమను బెదిరించారని సత్తెనపల్లికి చెందిన గంగమ్మ అనే మహిళ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. డబ్బులు ఇవ్వటానికి ఆమె నిరాకరించటంతో మంత్రి ఆమెకు సీఎం సహాయ నిధి నుంచి వచ్చిన చెక్ ను రాకుండా చేశారు. దీంతో జనసేన బాధిత మహిళకు రూ.4లక్షలు సహాయం అందజేసింది.

Janasena Pawan kalyan : కుమారుడ్ని కోల్పోయిన బాధిత మహిళకు రూ.4లక్షలు చెక్ అందించిన జనసేన

Janasenagave a check of Rs.4 lakh to Sattenapalli Gangamma

Janasena Pawan kalyan : కుమారుడ్ని పోగొట్టుకుని పరిహారంగా వచ్చిన డబ్బులో వాటా ఇవ్వాలని మంత్రి అంబటి రాంబాబు తమను బెదిరించారని సత్తెనపల్లికి చెందిన గంగమ్మ అనే మహిళ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అంబటి రాంబాబు సొంత నియోజక వర్గంలోని సత్తెనపల్లికి చెందిన గంగమ్మ కుమారుడు చనిపోతే ఆదుకోమని అంబటి రాంబాబును కోరానని, సీఎం సహాయ నిధి నుంచి రూ. ఐదు లక్షలు వచ్చాయన్నారు. అందులో రెండున్నర లక్షలు అంబటి అడిగారని.. ఎందుకివ్వాలని ప్రశ్నించినత తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని పరిహారంగా వచ్చిన డబ్బుల్లో సగం ఇవ్వాలని అంబటి అడిగారని గంగమ్మ మీడియా ముందుకొచ్చి చెప్పింది. ఈ వార్త పెను సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అలా మంత్రి అంబటి బాధిరాలు గంగమ్మకు జనసేన అండగా నిలబడింది. మీకు మేమున్నామని భరోసా ఇచ్చింది.

కేవలం భరోసాయే కాకుండా కొడుకును కోల్పోయిన గంగమ్మకు రూ.నాలుగు లక్షల చెక్కును అందజేసింది. జనసేన పిఎసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ చెక్కును స్వయంగా గంగమ్మకు అందజేశారు. అనంతం నాదెండ్ల మాట్లాడుతూ..కుమారుడిని కోల్పోయిన తల్లిపై కక్ష సాధింపా? ఇదేనా వైసీపీ ప్రభుత్వం ప్రజలు..మహిళల పట్ల వ్యవహరించే తీరు అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసిపి ప్రభుత్వం లో రాష్ట్ర వ్యాప్తంగా దారుణాలు, దాడులు పెరిగాయని..ప్రభుత్వం అవలంభించే విధానాలకు నష్టపోయిన బాధితులకు జనసేన అండగా నిలబడితే జనసేన చేసే కార్యక్రమాలకు సహాయ సహకారాలకు కూడా ప్రభుత్వం అడ్డుపడుతోందని విమర్శించారు.

వినాయక చవితి ఉత్సవాల నుంచి పార్టీ సభల వరకూ అన్నింటిపైనా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందని..కుటుంబానికి అండగా ఉండాల్సిన కొడుకును కోల్పోయిన తల్లిపై కూడా ప్రభుత్వం కక్ష సాధిస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. గంగమ్మ కుమారుడు ‌సెప్టిక్ ట్యాంక్ లో పడి ప్రాణాలు కోల్పోయాడు ..ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి న్యాయంగా రావాల్సిన డబ్బుల్లో కూడా వాటాలు అడుక్కునే దుస్థితికి మంత్రులు దిగజారిపోయారంటూ విమర్శించారు. ప్రశ్నించినావారిపై అక్రమ కేసులు..ఎదురు తిరిగినవారిపై బెదిరింపులకు పాల్పడుతూ గూండాగిరీ చేస్తున్నారని వైసీపీ నేతలు ప్రజా ప్రతినిథుల్లా కాకుండా గూండాల్లా వ్యహరిస్తున్నారని విమర్శించారు.

సిఎం సహాయ నిధి నుంచి సాయం అందిస్తామని తీరా సహాయం నిధి వచ్చాక కూడా దాంట్లో వాటాలు అడుక్కునే కక్కుర్తికి పాల్పడుతున్నారని..అంబటి బాగోతాన్ని బాధితురాలు స్వయంగా చెప్పుకుంటే ఆమెను..వారి బంధువులను కూడా బెదిరించారని నాదెండ్ల ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొడుకును కోల్పోయిన తల్లికి సీఎం సహాయ నిధి నుంచి ఐదు లక్షలు రూపాయలు మంజూరు అయితే… అందులో సగం తమకు ఇవ్వాలని ఎమ్మెల్యే హెచ్చరింపులు..మంత్రిగారి బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పేద కుటుంబమైన గంగమ్మ జనసేనను కలిసి తమ బాధలు చెప్పుకుందని దీంతో జనసేన అండగా నిలబటంతో నిజాన్ని బయటపెట్టినందుకు అంబటి రాంబాబు ఆమెను..ఆమె బంధువలున్ని చంపేస్తామని బెదిరించారని వెల్లడించారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా గంగమ్మ ధైర్యం గా నిలబడ్డారుని అలా బాధితులు తమ హక్కుల కోసం పోరాడే సమయంలో ఎటువంటి బెదిరింపులకు భయపడకూడదని సూచించారు.

సీఎం సహాయ నిథి నుంచి వచ్చిన పరిహారం డబ్బుల్లో సగం గంగమ్మ ఇవ్వటానికి నిరాకరించినందుకు చివరికి ఐదు లక్షల చెక్ ను ఆమెకు ఇవ్వకుండా వెనక్కి తీసేసుకున్నారని తెలిపారు. కానీ ప్రభుత్వం చేయలేని సహాయాన్ని..గంగమ్మకు జనసేన ఇచ్చిందని రూ.నాలుగు లక్షల చెక్కును గంగమ్మకు జనసేన ఇచ్చిందని తెలిపారు. మంత్రి, ఎమ్మెల్యేలకు భయపడి చెక్ కనిపించడం లేదని అధికారులు కూడా డ్రామాలు ఆడారని తెలిపారు.చేతికి వచ్చిన కొడుకు చనిపోతే ఆ తల్లి మీద కనీస జాలి లేదా? అని ప్రశ్నించారు జనసేన నేత నాదెండ్ల. పదవుల్లో ఉన్నామని అహంకారంతో ఉంటే…మీకు ఓట్లు వేసి గెలిపించని ప్రజలే మిమ్మల్ని ఇంటికి సాగనంపటం ఖాయం అని అన్నారు. ఇంత జరిగినా సిఎం జగన్మోహన్ రెడ్డికి తెలియదా? అని ప్రశ్నించారు. ఎంతటి ఘోరాలు జరిగినా సీఎం మాత్రం ఏమాత్రం స్పందించరు..ప్యాలెజ్ వదలి బయటకు రారు..స్పందించే మనసు ఉన్నా..కనీసం మానవత్వం ఉన్నా బాధితురాలు గంగమ్మను పిలిపించి మాట్లాడాలని డిమాండ్ చేశారు.

ఏపీ మహిళలు నాకు అక్క, చెల్లెళ్లు అని‌ చెప్పుకునే జగన్ రెడ్డికి‌ చిత్తశుద్ధి ఉంటే కుమారుడ్ని కోల్పోయిన తల్లిని నానా ఇబ్బందులకు గురి చేసి సీఎం సహాయనిధి అందకుండా చేసి చంపేస్తామని బెదిరించిన మత్రి అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఆ తల్లికి జరిగిన అన్యాయంపై జనసేన మానవత్వం తో స్పందించి నాలుగు లక్షల రూపాయల చెక్కు ఇచ్చిందని చెప్పుకొచ్చారు జనసేన పిఎసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.