KA Paul : పోలీసుల నిర్బంధంలో కేఏ పాల్.. పద్మావతి మహిళా యూనివర్సిటీలో హంగామా

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో హంగామా చేశారు. దీంతో పోలీసులు ఆయనను నిర్బంధించారు.

KA Paul : పోలీసుల నిర్బంధంలో కేఏ పాల్.. పద్మావతి మహిళా యూనివర్సిటీలో హంగామా

KA Paul : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో హంగామా చేశారు. మెరుగైన ఆరోగ్యం కోసం అంటూ హాస్టల్ వద్ద ఓ విద్యార్థినికి ప్రార్థన చేశారు కేఏ పాల్. వర్సిటీ హాస్టల్ వద్ద కేఏ పాల్ ఆయన అనుచరుల హంగామాను సెక్యూరిటీ సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వర్సిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. యూనివర్సిటీ హాస్టల్ వద్దే కేఏ పాల్ ను నిర్బంధించారు. అక్కడి నుంచి ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ వ్యవహారంపై వర్సిటీ ఇంచార్జి వీసీ గీతావాణి స్పందించారు. ‘అనుమతి లేకుండా కేఏ పాల్ తన అనుచరులతో యూనివర్సిటీలోకి వచ్చారు. మహిళా యూనివర్సిటీ హాస్టల్ వద్ద ఇతరులకు ప్రవేశం లేదు. కొన్ని వాహనాలు, వ్యక్తిగత సిబ్బందితో కేఏ పాల్ హాస్టల్ వద్దకు వచ్చారని సెక్యూరిటీ సిబ్బంది మాకు సమాచారం ఇచ్చారు. మేమే పోలీసులకు ఫిర్యాదు చేశాము. మహిళా యూనివర్సిటీ హాస్టల్ వద్దకు వచ్చి ఇలా మతపరమైన ప్రార్థనలు చేయడం సరికాదు. యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది వారించినా పాల్ వినిపించుకోలేదు. వాహనాలతో లోపలకు వచ్చారు’ అని గీతావాణి చెప్పారు.