YS Viveka case: అవినాశ్ రెడ్డితో మాట్లాడాను.. హత్య కేసులో హస్తం ఉందా? లేదా? అని అడిగాను: కేఏ పాల్

నాలుగు సంవత్సరాలు ఊరికే ఉండి, ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు హడావుడి చేస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు.

YS Viveka case: అవినాశ్ రెడ్డితో మాట్లాడాను.. హత్య కేసులో హస్తం ఉందా? లేదా? అని అడిగాను: కేఏ పాల్

KA Paul

KA Paul: ఏపీ (AP) మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి (Chandrababu Naidu) హయాంలోనే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. తాను వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డితో నిన్న మాట్లాడానని చెప్పారు. ఇవాళ కర్నూలులో కేఏ పాల్ 10 టీవీతో మాట్లాడుతూ… అప్పట్లో, హత్య జరిగి 100 రోజులు అయినా ఎందుకు చంద్రబాబు పూర్తి స్థాయిలో విచారణ జరిపించలేదని నిలదీశారు.

చంద్రబాబు పూర్తి స్థాయిలో విచారణ చేయించలేదని కేఏ పాల్ అన్నారు. సీబీఐ వన్ సైడ్ విచారణ జరుపుతోందని ఆరోపించారు. ఆస్తుల తగాదాలో ఎవరు బెనిఫిట్ పొందారో విచారణ జరగాలని అన్నారు. నాలుగు సంవత్సరాలు ఊరికే ఉండి, ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు హడావుడి చేస్తున్నారని ఆరోపించారు.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిజాలు తేలాలని కేఏ పాల్ అన్నారు. కేవలం వైఎస్ అవినాశ్ రెడ్డి, వారి తండ్రిని మాత్రమే ఎందుకు సీబీఐ టార్గెట్ చేసిందని నిలదీశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అవినాశ్ రెడ్డి ఎవరో నిన్నటి వరకు తనకు తెలియదని అన్నారు.

నిన్న అవినాశ్ రెడ్డితో మాట్లాడానని, వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన హస్తం ఉందా? లేదా? అని అడిగానని తెలిపారు. తాను హత్య చెయ్యాల్సిన అవసరం లేదని అవినాశ్ రెడ్డి చెప్పారని అన్నారు. ఆ కేసును తాను చంద్రబాబు నాయుడు కుట్రగానే భావిస్తున్నానని తెలిపారు. లోకేశ్ ను సీఎం చేయడానికి చంద్రబాబు నాయుడు డ్రామా ఆడుతున్నారని చెప్పారు.

YS Viveka Case : ఎర్ర గంగిరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్ .. హైకోర్టు తీర్పుపై స్టే