YS Viveka Case : ఎర్ర గంగిరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్ .. హైకోర్టు తీర్పుపై స్టే

బెయిల్ కోసం వేచి చూస్తున్న ఎర్రగంగిరెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

YS Viveka Case : ఎర్ర గంగిరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్ .. హైకోర్టు తీర్పుపై స్టే

Erra Gangireddy YS Viveka Case

Erra Gangireddy YS Viveka Case : వైఎస్ వివేకానందరెడ్డి కేసులో ఏ1 నిందితుడుగా ఉన్న ఎర్రగంగిరెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. జైలై1న గంగిరెడ్డికి బెయిల్ ఇవ్వొచ్చు అంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై దేశ అత్యున్నత ధర్మాసనం అయిన సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణు జులై 14కు వాయిదా వేసింది.

వివేకానందరెడ్డి హత్య చేసులో ఎర్రగంగిరెడ్డి ఏ1 నిందితుడుగా ఉన్న విషయం తెలిసిందే. గతంలో బెయిల్ పై బయట ఉన్న గంగిరెడ్డిని సీబీఐ కోర్టులో లొంగిపోవాలని లేదంటే అరెస్ట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో గంగిరెడ్డి తన న్యాయవాది సలహా మేరకు లొంగిపోయారు. దీంతో ఆయన చంచల్ గూడ జైలులో ఉంటున్న విషయం తెలిసిందే.

Erra Gangireddy Bail Cancel : వైఎస్ వివేక హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు

గంగిరెడ్డి డీఫాల్ట్ బెయిల్ ను రద్దు చేస్తూ గత నెల 27న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30లోగా దర్యాప్తును పూర్తి చేయాలని సీబీఐకి సుప్రీంకోర్టు గడువు విధించినందున … జులై 1న గంగిరెడ్డి విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

ఈ కేసులో ఆయన కీలక ఏ1 నిందితుడుగా ఉన్నారని ఈ సమయంలో బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు జులై 1న గంగిరెడ్డిని విడుదల చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది.

YS Viveka Case : సీబీఐ కోర్టు ముందు హాజరైన ఎర్రగంగిరెడ్డి .. లొంగిపోతారా? పారిపోతారా?