KCR Targets AP : కేసీఆర్ టార్గెట్ ఏపీ.. బీఆర్ఎస్ విస్తరణకు ప్లాన్, విశాఖలో భారీ బహిరంగ సభ
KCR Targets AP : దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ను విస్తరించి బీజేపీకి ప్రత్యామ్నాయంగా చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యం. తెలుగు రాష్ట్రాల్లో పట్టు..

KCR Targets AP
KCR Targets AP : బీఆర్ఎస్ విస్తరణపై ఆ పార్టీ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి
కేసీఆర్ దృష్టి పెట్టారు. నాందేడ్ సభతో మహారాష్ట్రలో ప్రవేశించిన బీఆర్ఎస్, ఏపీలో భారీ బహిరంగ సభకు సిద్ధమవుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళమెత్తి ఏపీలో ప్రజాదరణ పొందేందుకు వ్యూహరచన చేశారు కేసీఆర్. ఏపీలో కారు దూసుకుపోయేందుకు సరికొత్త సమీకరణాలు రచిస్తున్నారు.
విశాఖ ఉక్కు తెలుగోడి హక్కు పేరుతో ముందుగా సభ నిర్వహించనున్నారు కేసీఆర్. ఈ నెలలోనే ఈ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిని ఆదేశించారు. ఈ సభ వేదికగానే ఏపీలో బీఆర్ఎస్ లోకి భారీగా నేతలనే చేర్చుకోవాలన్నది కేసీఆర్ వ్యూహం. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ ను విస్తరించి బీజేపీకి ప్రత్యామ్నాయంగా చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యం. ముందుగా తెలుగు రాష్ట్రాల్లో పట్టు పెంచుకోవాలని భావిస్తున్నారు.(KCR Targets AP)
Also Read..Tirupati Assembly Constituency: తిరుపతి అసెంబ్లీ సీటుపై పవన్ కల్యాణ్ కన్ను పడిందా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏపీ నేతలతో కేసీఆర్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు రాష్ట్ర పరిస్థితులపై సమగ్ర అవగాహనా ఉంది. తన అనుభవాన్ని ఉపయోగించి కొత్త వ్యూహాలతో బీఆర్ఎస్ ను విస్తరించి ఏపీ రాజకీయాలను మలుపు తిప్పాలని ఆశిస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీలో భారీగా ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.
భారీ బహిరంగ సభ వేదికపై వీలైనంత ఎక్కువమంది నేతలను పార్టీలో చేర్చుకోవాలన్నది కేసీఆర్ ఆలోచన. ఇప్పటికే కాంగ్రెస్, వైసీపీ, టీడీపీతో పాటు ప్రజా సంఘాల నేతలతో ఆయన సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. తెలంగాణ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, జాతీయ రాజకీయాలను ఏపీ ప్రజలకు వివరించాలని కేసీఆర్ అనుకుంటున్నారు.(KCR Targets AP)
బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ కు తెలంగాణ తర్వాత ఏపీనే అత్యంత ముఖ్యమైన రాష్ట్రం అవుతుంది. ఏపీలో ఒకవేళ కేసీఆర్ అనుకున్న ఆదరణ లభిస్తే దేశవ్యాప్తంగా కేసీఆర్ గ్రాఫ్ పెరుగుతుంది. అయితే, కేసీఆర్ ఏపీలో పెట్టుకున్న లక్ష్యాలు నెరవేరుతాయా? లేదా? అన్నది చూడాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు కారణమైన నేతగా కేసీఆర్ ను ఏపీ ప్రజలు దూరం పెడతారా? లేక విభజన విషయాలు మర్చిపోయి ఆదరిస్తారా? అన్నది మరికొన్ని నెలల్లో తేలనుంది.