Telangana : పరీక్షలు రద్దు చేయటం కాదు .. కేసీఆర్ ప్రభుత్వాన్నే రద్దు చేయాలి : రేవంత్ రెడ్డి
సీఎం కేసీఆర్ పాలనను గాలికొదిలేశారని..ఇక పరీక్షల్ని రద్దు చేయటం కాదు సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్నే రద్దు చేయాలని అంటూ రేవంత్ రెడ్డి సంచలన విమర్శలు చేశారు.

Telangana : సీఎం కేసీఆర్ పై మరోసారి తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ పాలనను గాలికొదిలేశారని..పశ్నాపత్రాల లీకులతో లక్షలాది మంది విద్యార్ధులు,నిరుద్యోగులతో ఆటలాడుతున్నారంటూ విమర్శలు సంధించారు. 10th క్లాస్ పేపర్స్ నుంచి TSPSC వరకు అన్ని వ్యవస్థల్ని భ్రష్టుపట్టించాని..అన్నివ్యవస్థలు కుప్పలాయని ఆరోపించారు. ఇక పరీక్షల్ని రద్దు చేయటం కాదు సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్నే రద్దు చేయాలని అంటూ సంచలన విమర్శలు చేశారు.
తెలంగాణలో వరుసగా పేపర్ లీక్ లు అవుతున్నాయి. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్, పదో తరగతి పేపర్ లీక్ కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచనం కలిగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పదో తరగతి పేపర్ లీకేజీ కలకలం రేపుతోంది. తెలంగాణలో నిన్న పదో తరగతి పరీక్ష ప్రారంభమైన కాసేపటికే ప్రశ్నపత్రం వాట్సాప్ గ్రూపుల్లో కనపడడం కలకలం రేపిన ఘటనను మరవకముందే ఇవాళ కూడా అటువంటి ఘటనే చోటుచేసుకుంది. నిన్నటి తెలుగు పరీక్ష ప్రశ్న పత్రం వికారాబాద్ జిల్లా తాండూరులోని ఓ కేంద్రం నుంచి లీకైతే నేటి హిందీ ప్రశ్నపత్రం హనుమకొండలోని ఓ కేంద్రం నుంచి బయటకు వచ్చింది.
అలాగే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం కూడా తెలంగాణలో పెను సంచలనంగా మారింది. సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పేపర్ లీకేజీ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసులో ఈడీ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. ఇలా ప్రశ్నాపత్రాల లీకులు కేసీఆర్ ప్రభుత్వానికి తలనొప్పులుగా మారాయి. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలో ప్రతిపక్షాలు బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు సంధిస్తున్నారు. దీంట్లో భాగంగానే కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పాలనను గాలికొదిలేశారని..ఇక పరీక్షల్ని రద్దు చేయటం కాదు సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్నే రద్దు చేయాలని అంటూ సంచలన విమర్శలు చేశారు.
10th Question Paper Leak: టెన్త్ పేపర్ లీకేజ్ ఘటనలో వెలుగులోకి కీలక విషయాలు..