10TH Exam Paper Leak : తెలంగాణ టెన్త్ పరీక్ష పేపర్ లీక్ లో దర్యాప్తు ముమ్మరం.. టీచర్ ను విచారిస్తున్న పోలీసులు

పాఠశాలలో సైన్స్ టీచర్ గా పని చేస్తున్న బంద్యప్పను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని ఫోన్ నుంచి బయటకు వచ్చినట్లు పేపర్ బయటికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. బంద్యప్ప ఫోన్ ను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.

10TH Exam Paper Leak : తెలంగాణ టెన్త్ పరీక్ష పేపర్ లీక్ లో దర్యాప్తు ముమ్మరం.. టీచర్ ను విచారిస్తున్న పోలీసులు

10TH Exam Paper Leak

Updated On : April 3, 2023 / 5:38 PM IST

10TH Exam Paper Leak : తెలంగాణలో వరుసగా పేపర్ లీక్ లు అవుతున్నాయి. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్, పదో తరగతి పేపర్ లీక్ కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచనం కలిగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పదో తరగతి పేపర్ లీకేజీ కలకలం రేపుతోంది. వికారాబాద్ జిల్లా తాండూరులో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పేపర్ లీకేజీపై పోలీస్ శాఖ, విద్యాశాఖ స్పీడ్ పెంచింది.

పాఠశాలలో సైన్స్ టీచర్ గా పని చేస్తున్న బంద్యప్పను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని ఫోన్ నుంచి బయటకు వచ్చినట్లు పేపర్ బయటికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. బంద్యప్ప ఫోన్ ను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. ఎమ్ ఈవో వెంకటయ్యగౌడ్, ఎమ్మార్వో చిన్నపిల్ల నాయుడు బంద్యప్పను విచారిస్తున్నారు. ప్రశ్నాపత్రాన్ని ఎవరెవరికి ఫార్వర్డ్ చేశారన్నదానిపై విచారణ కొనసాగుతోంది.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు.. నిందితుల రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు

ఉదయం 9.37 గంటలకు వాట్సాప్ గ్రూప్ లో ప్రశ్నాపత్రం చక్కర్లు కొట్టింది. పరీక్ష కంటే ముందే పేపర్ లీక్ అయ్యిందా? లేదా? అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మధ్యాహ్నం 12.30 గంటలకు పరీక్ష కేంద్రం నుండి బయటికి వచ్చిన విద్యార్థుల దగ్గర పేపర్ ను చూడగా వాట్సాప్ గ్రూప్ లో ఉన్న పేపర్, ఎగ్జామ్ పేపర్ ఒకటేనని తెలుస్తోంది. అటు పదో తరగతి పేపర్ లో ఎలాంటి లీకేజీ జరుగలేదని వికారాబాద్ అడిషనల్ ఎస్పీ మురళీ చెప్పారు.

పేపర్ ను బంద్యప్ప వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేశాడని చెప్పారు. అయితే అప్పటికే విద్యార్థలందరూ పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లారని చెప్పారు. పేపర్ ను షేర్ చేసిన బంద్యప్పపై కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు పేపర్ లీక్ ప్రచారాన్ని విద్యాశాఖ ఖండించింది. పదో తరగతి పేపర్ లీక్ జరిగిందన్న వార్తలను తాండూరు డీఈవో రేణుకాదేవి కొట్టివేశారు.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరొకరు అరెస్టు.. ప్రశ్నాపత్రం కొనుగోలుకు రూ.10 లక్షల ఒప్పందం

మొబైల్ ఫోన్ పేపర్ వచ్చింది అవాస్తమన్నారు. తాండూరు మండలంలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ పరీక్ష కేంద్రాల్లో తనిఖీలు చేశారని డీఈవో చెప్పారు. అయితే ఎగ్జామినేషన్ సెంటర్లలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని, మొబైల్ ఫోన్లను నిషేధించామని తెలిపారు. ఉదయం 9.30 గంటలకే పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. కాసేపటికే వాట్సాప్ లో పేపర్ చక్కర్లు కొట్టడం మొదలైంది.

పేపర్ లీకేజీ వాస్తవం కాదని అధికారులు అంటున్నారు. కేవలం ఇన్విజిలేటర్ ఫోటోలు తీసి కావాలని మీడియా గ్రూప్ లో పోస్ట్ చేసి డిలీట్ చేశారని పేర్కొన్నారు. ఆ తరువాత ఒక ప్రైవేట్ స్కూల్ సైన్స్ టీచర్ కి నిందితుడు పంపాడు. ఆ పేపర్ ను అవగాహన చేసుకుని చిట్టిలు తయారుచేసేందుకు 11.45 గంటల సమయం పట్టింది. పరీక్ష 12.30 గంటలకు ముగుస్తుండటం తో ఏమి చేయాలో తోచక ఎవ్వరికీ పంపలేకపోయాడు.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ఇంటి దొంగల బాగోతం.. 12 మంది నిందితులు అరెస్ట్

అయితే, ఇందులో రాజకీయ కోణం ఉన్నట్టుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బంద్యప్ప ఉద్దేశపూర్వకంగానే ఫొటోలు తీసినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ముగ్గురిపై వేటు వేశారు. పాఠశాల విద్య శాఖ కమిషనర్ దేవసేన ప్రెస్ నోట్ విడుదల చేయనున్నారు.