TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు.. నిందితుల రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు

టీఎస్పీఎస్సీ(TSPSC) పేపర్ లీకేజ్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో సిట్(SIT) ముమ్మర దర్యాప్తు చేస్తోంది.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు.. నిందితుల రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు

TSPSC paper (5) (1)

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ(TSPSC) పేపర్ లీకేజీ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో సిట్(SIT) ముమ్మర దర్యాప్తు చేస్తోంది. ఇప్పటివరకు ఈ కేసులో 12 మంది నిందితులను సిట్ అధికారులు ఆరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. 12 మంది రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికి వరకు 12 మంది నిందితులను ఆరెస్ట్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్ లో సిట్ అధికారులు పేర్కొన్నారు. తొమ్మిది మంది నిందితులతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

ఈ ముగ్గురిలో ఇద్దరు టీఎస్పీఎస్సీ ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. ఇప్పటివరకు నలుగురు టీఎస్పీఎస్సీ ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. A-1 ప్రవీణ్ TSPSC సెక్రెటరీ పీఏ, A-2 రాజశేఖర్, నెట్వర్క్ అడ్మిన్, A-10 షమీమ్ ASO, A-12 రాజశేఖర్ డాటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేస్తున్నారు. నిందితుల్లో మరో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. 19 మంది సాక్ష్యులను విచారించినట్టు రీమాండ్ రీపోర్ట్ లో సిట్ అధికారులు పేర్కొన్నారు.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ఇంటి దొంగల బాగోతం.. 12 మంది నిందితులు అరెస్ట్

టీఎస్పీఎస్సీ ఉద్యోగి శంకర్ లక్ష్మిని ప్రధాన సాక్షిగా వెల్లడించారు. శంకర్ లక్ష్మితో పాటు టీఎస్పీఎస్సీ, తెలంగాణ స్టేట్ టెక్నీకల్ సర్వీస్ ఉద్యోగులను సాక్షులుగా పేర్కొన్నారు. కర్మన్ ఘాట్ లోని ఒక హోటల్ లోని యాజమని, ఉద్యోగిని సాక్షిగా పేర్కొన్నారు. హోటల్ లోని సీసీటీవి కెమెరాలో పేపర్ ఎక్సెంజ్ వ్యవహారం నిక్షిప్తమైంది. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు షమీమ్, రమేష్, సురేష్ లను సిట్ అధికారులు ఆరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితుల నుండి ఒక ల్యాప్ టాప్ మూడు మొబైల్ ఫోన్స్ స్వాదినం చేసుకున్నారు.

గ్రూప్-1లో 127 మార్కులు వచ్చిన షమీమ్ అనే నిందితుడు, 122 మార్కులు సాధించిన మరో నిందితుడు రమేశ్ సహా సురేశ్ అనే మరో నిందితుడిని పోలీసులు నిన్న (గురువారం) అరెస్టు చేశారు.వారిని నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా వారికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను కోర్టు ఆదేశాలతో చంచల్ గూడ జైలుకి తరలించారు. రమేశ్, సురేశ్, షమీమ్ 14 రోజులు(ఏప్రిల్ 6 వరకు) రిమాండ్ లో ఉండనున్నారు. అంతకముందు 9 మంది నిందితులను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. నిందితుడు రమేశ్ టీఎస్పీఎస్సీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు.

TSPSC Office : టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద పోస్టర్లు కలకలం

అలాగే, మరో నిందితుడు షమీమ్ 2013లో గ్రూప్-2 ఉద్యోగం పొందాడు. రాజశేఖర్ నుంచి అతడు గ్రూప్-1 ప్రశ్నాపత్రం తీసుకున్నాడు. గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని తాను రాజశేఖర్ ఇచ్చాడని అధికారుల ముందు అంగీకరించాడు. కాగా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ లీకేజీ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. సిట్ విచారణ జరుగుతున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. మరోవైపు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నారైలు కూడా పరీక్షలు రాశారని ఆరోపిస్తున్నారు.