TSPSC Office : టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద పోస్టర్లు కలకలం

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC)పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనం కలిగిస్తున్న విషయం తెలిసిందే. పేపర్ లీకేజీకి సంబంధించి నిరసన గళం వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ లోని టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద పోస్టర్లు కలకలం రేపాయి.

TSPSC Office : టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద పోస్టర్లు కలకలం

TSPSC (1)

TSPSC Office : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC)పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనం కలిగిస్తున్న విషయం తెలిసిందే. పేపర్ లీకేజీకి సంబంధించి నిరసన గళం వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ లోని టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద పోస్టర్లు కలకలం రేపాయి. టీఎస్పీఎస్సీ ఓ జిరాక్స్ సెంటర్ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఓయూ(OU) జేఏసీ చైర్మన్ అర్జున్ బాబు(JAC Chairman Arjun Babu)టీఎస్పీఎస్సీ కార్యాలయం గోడకు ఈ పోస్టర్లను అంటించారు. ఇక్కడ అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల ప్రవేశ ప్రశ్నాపత్రాలు లభిస్తాయని వ్యంగ్యంగా పోస్టర్లపై రాశారు.

‘తప్పు చేసిన టీఎస్పీఎస్సీని రద్దు చేయకుండా, కేవలం పరీక్షను రద్దు చేయడమేంటీ? శిక్ష ఎవరికి బోర్డుకా? విద్యార్థులకా?.. ‘ఇదీ ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ పనితీరు.. ముఖ్యమంత్రి గారు.. మీరు తక్షణమే తెలంగాణ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. టీఎస్పీఎస్సీ పేపరు లీకేజీలో మీ కుటుంబ సభ్యుల పాత్రలేదని చెప్పడానికి వెంటనే సీబీఐకి అప్పగించి టీస్పీఎస్సీ బోర్డును మరియు సంబంధిత శాఖ మంత్రిని భర్తరఫ్ చేయండి. నస్టపోయిన విద్యార్థులకు ఈ నెల నుంచే నెలకు 10,000/-రూ. చొప్పున మళ్లీ పరీక్ష నిర్వహించే వరకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి’ అంటూ పోస్టర్ లో రాశారు.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. అధికారిణి శంకర్ లక్ష్మీ విచారణలో కీలక విషయాలు

టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీ వ్యవహారంలో మరో ట్విస్టు వెలుగు చూసింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారిణి శంకర్ లక్ష్మీ విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. శంకర్ లక్మీతోపాటు మరో మహిళను సిట్ అధికారులు విచారించారు. శంకర్ లక్ష్మీ డైరీలోని పాస్ వర్డ్ చోరీపై ప్రశ్నించారు. అయితే తన డైరీలో ఎక్కడా పాస్ వర్డ్ రాయలేదని శంకర్ లక్ష్మీ తెలిపారు. డైరీలోని పాస్ వర్డ్ చోరీ చేశామని నిందితులు విచారణలో చెప్పడంతో సిట్(SIT)అధికారులు శంకర్ లక్ష్మీని ప్రశ్నించారు. సుమారు రెండు గంటలకు పైగా శంకర్ లక్ష్మీని విచారించారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో విచారణ కొనసాగుతోంది. పేపర్ లీకేజీ నిందితులు రేణుక, ఆమె భర్త డాక్యా నాయక్ పై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. వనపర్తి జిల్లా గోపాల్ పేట్ మండలం బుద్ధారం బాలికల గురుకుల పాఠశాలలో హిందీ టీచర్ గా రేణుక పనిచేస్తున్నారు. ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రెటరీ రోనాల్డ్ రోస్ కి ఆ స్కూల్ ప్రిన్సిపాల్ నివేదిక పంపారు. దీని ఆధారంగా రేణుకని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే, వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ఎంపీడీవో ఆఫీస్ లో ఉపాధి హామీలో టెక్నికల్ అసిస్టెంట్ గా రేణుక భర్త డాక్యా నాయక్ పని చేస్తున్నారు.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో బండి సంజయ్ కు సిట్ నోటీసులు

విధుల నుంచి ఆయనను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పేపర్ లీక్ నేపథ్యంలో ఇప్పటికే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌, ఏఈఈ, డీఏవో పరీక్షలను రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. పలువురు రాజకీయ నాయకులు పలు ఆరోపణలు చేయడంతో ఆధారాల కోసం వారికి కూడా నోటీసులు జారీ అయ్యాయి.