Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు .. టీ సర్కార్ ప్లాన్ అదేనంటూ ట్విస్ట్..

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశం తెలుగు రాష్ట్రాల మధ్య హీట్ పుట్టిస్తున్న క్రమంలో ఇదే అంశంపై ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ అదేనంటూ అసలు విషయం బయటపెట్టారు.

Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు .. టీ సర్కార్ ప్లాన్ అదేనంటూ ట్విస్ట్..

Vizag Steel Plant

Vizag Steel Plant: ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ (Union Minister Minister Fagan Singh) చేసిన కీలక వ్యాఖ్యలతో స్టీల్ ప్లాంట్ అంశం మరో మలుపు తిరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశం తెలుగు రాష్ట్రాల మధ్య హీట్ పుట్టిస్తున్న క్రమంలో ఇదే అంశంపై ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని.. దాని కంటే ముందు ఆర్‌ఎన్‌ఐఎల్‌ను బలోపేతం చేసే పనిలో ఉన్నామని అన్నారు. ప్లాంట్ పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ ప్రక్రియ జరుగుతోందన్నారు.

అంతేకాదు స్టీల్ ప్లాంట్ బిడ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనటం అనేది అదో పెద్ద ప్లాన్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్లాంట్ పూర్తిస్థాయి సామర్ధ్యం మేరకు ప్లాంట్ పని చేయటానికి తీసుకునే చర్యల్లో భాగంగా ఆర్‌ఎన్‌ఐఎల్‌ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం బిడ్‌లో పాల్గొనడం ఒక ఎత్తుగడ మాత్రమే అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కల్పించుకోవటం..బిడ్ వేస్తామని నిర్ణయించుకోవటం ఈ విషయాన్ని ప్రకటించటం..తద్వారా ఏపీలో దీనిపై ప్రభుత్వం విమర్శలు,ప్రతిగా తెలంగాణ నేతల విమర్శలు ఇలా స్టీల్ ప్లాంట్ తెలుగు రాష్ట్రాల్లో వేడి రాజేస్తోంది. దీంతో ఇది కేంద్రస్థాయిలో కూడా కలకలం రేపినట్లుగా ఉంది కేంద్రమంత్రి వ్యాఖ్యలు చేయటం చూస్తుంటే..ఇలా ప్రస్తుతం జాతీయ స్థాయి రాజకీయల్లో స్టీల్ ప్లాంట్ హైలైట్ అవుతోంది.

కాగా.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) బిడ్ వేయాలని నిర్ణయించారు. దీంతో ఏపీ రాజకీయాలు (AP Politics) కూడా హీటెక్కాయి.. బీజేపీ (BJP)ని దెబ్బ తీయడానికి కేసీఆర్ ఎత్తుగడ ఏపీ ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెంచినట్లుగా మారింది. తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం మధ్య మాటల తూటాలు పేలుడులు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో నిన్న మొన్నటి వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కరణలో వెనుకడుగు వేసే అవకాశమే లేదని తేల్చి చెప్పిన కేంద్రం ఏపీతెలంగాణలో కాకపుట్టిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై స్పందించేలా మారింది పరిస్థితి.