Killer Gang : కిల్లర్‌ గ్యాంగ్‌ అరెస్టు..విచారణలో విస్తుపోయే నిజాలు

పశ్చిమ గోదావరి జిల్లాలో హడలెత్తించిన కిల్లర్‌ గ్యాంగ్‌ పోలీసులకు పట్టుబడింది. నలుగురు సభ్యులుగల ముఠాను వలవేసి పట్టుకున్నారు. ఎన్నో దారుణాలకు పాల్పడిన ఈ ముఠాకు లీడర్‌ ఓ కిలాడీ లేడీ.

Killer Gang : కిల్లర్‌ గ్యాంగ్‌ అరెస్టు..విచారణలో విస్తుపోయే నిజాలు

Police

police arrested Killer gang : డబ్బు కోసం ఎంతదాకైనా వెళ్తారు. ఏం చేయడానికైనా సిద్ధమవుతారు. చివరికి ప్రాణాలను సైతం తీయడానికి వెనుకాడరు. వారికి డబ్బులే ముఖ్యం. అందుకోసం దేనికైనా తెగిస్తారు. ఇప్పటి వరకు అనేక దారుణాలకు పాల్పడ్డారు. కొందరి ప్రాణాలు తీశారు. మరికొందరిని బ్లాక్‌మెయిల్ చేశారు. ఇంకొందరిని రకరకాల పేర్లతో మోసగించారు. చివరికి తాము చేసిన పాపాలు పండి పోలీసులకు చిక్కారు. పశ్చిమ గోదావరి జిల్లాలో హడలెత్తించిన కిల్లర్‌ గ్యాంగ్‌ పోలీసులకు పట్టుబడింది. నలుగురు సభ్యులుగల ముఠాను వలవేసి పట్టుకున్నారు. ఎన్నో దారుణాలకు పాల్పడిన ఈ ముఠాకు లీడర్‌ ఓ కిలాడీ లేడీ.

సుష్మా చౌదరి…. అలాంటి ఇలాంటి మహిళ కాదు. ఈజీ మనీకి, జల్సాలకు అలవాటుపడ్డ సుష్మా…. మరో ముగ్గురితో కలిసి ముఠాను ఏర్పాటు చేసుకుంది. డబ్బే లక్ష్యంగా ఏం చేయడానికైనా వారిని సిద్ధం చేసింది. ప్రజలను ఎన్ని రకాలుగా మోసం చేయవచ్చో అన్ని రకాలుగా చేసింది. రైస్‌ పుల్లింగ్‌, గుప్త నిధులు, చేతబడులు, ఆత్మలు, గంజాయి, సోషల్‌ మీడియా.. ఇలా ఒకటేమిటి తనకు తెలిసిన అన్ని రకాలుగా మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. చివరికి హనీట్రాప్‌ ద్వారానూ పలువురిని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు లాగిందీ కిలాడీ లేడీ.

BCCI : హైదరాబాద్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ప్రకటించని బీసీసీఐ..హెచ్‌సీఏలో అంతర్గత గొడవలే కారణమా?

సుష్మా చౌదరి గ్యాంగ్‌… మోసాలు ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాకే పరిమితం కాలేదు. ఏపీ మొత్తంగా తన క్రైమ్‌ సామ్రాజ్యాన్ని విస్తరించింది. కొందరిని గుప్త నిధుల పేరిట మోసం చేసి లక్షల రూపాయలు లాగేసుకుంది. చేతబడులు, బాణామతి, ఆత్మల పేరిట తవ్వకాలు జరుపుతామంటూ మరికొందరి దగ్గర మనీ తీసుకుంది. రైస్‌ పుల్లింగ్‌, విలువైన నాణేలంటూ మోసాలకు పాల్పడింది. ఈ గ్యాంగ్ గంజాయిని కూడా వదలలేదు. ముందే చెప్పాంగా.. డబ్బు కోసం ఏమైనా చేస్తుందని. గంజాయి అక్రమ రవాణా చేస్తూ డబ్బులు సంపాదించిందీ కిల్లర్‌ గ్యాంగ్‌.

సోషల్‌ మీడియా వేదికగా పలువురికి వలపు వల విసిరింది సుష్మా అండ్‌ గ్యాంగ్‌. అమాయకులు, యువకులను టార్గెట్‌ చేస్తూ వారి సెల్‌ఫోన్‌ నంబర్స్‌ను సంపాదించేది. ఆ తర్వాత వారితో చాటింగ్‌లు మొదలుపెట్టేది. స్నేహమంటూ పరిచయం పెంచుకుని హద్దులు దాటుదామా అంటూ కవ్వించేది. ఇందుకు టెంప్ట్‌ అయ్యారో ఇక వారి పని ఖతం. ఓ ప్లేస్‌కు చెప్పి రమ్మని మెసేజ్‌ చేస్తుంది. అక్కడికి వెళ్లాక మిగతా సభ్యులంతా ఫోటోలు తీసి, కొట్టి, బ్లాక్‌ మెయిల్‌ చేసి డబ్బులు లాగేవారని పోలీసులు తెలిపారు.

Film Industry : ఏపీలో సినిమా కష్టాలు కొలిక్కి వచ్చాయా?

ఈ కిల్లర్‌ గ్యాంగ్ తమ గుట్టు బయటపడకుండా ఉండేందుకు ఎదుటివారి ప్రాణాలు సైతం తీసేందుకు వెనుకాడేది కాదు. గుంటూరుకు చెందిన శశి చౌదరి అనే వ్యక్తికి సైనైడ్‌ ఇచ్చి చంపేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ మరణాన్ని సాధారణ మరణంగానూ చిత్రీకరించినట్టు పోలీసులు తెలిపారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఈ గ్యాంగ్‌పై పలు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. హద్దు అదుపూ లేకుండా క్రైమ్స్‌కు పాల్పడ్డారు.

ఓ హనీట్రాప్‌ కేసులో పట్టుబడిన నిందితులను విచారించగా… క్రైమ్ చిట్టా అంతా విప్పారు. దీంతో ఈ గ్యాంగ్‌ను త్రీటౌన్‌ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. దీంతో సుష్మా గ్యాంగ్ జైల్‌లో ఇప్పుడు చిప్పకూడు తింటోంది.ఈ ముఠా నుంచి 25 గ్రాముల బంగారం, 6 మొబైల్‌ ఫోన్స్‌, కారు, సీసీ కెమెరాతోపాటు.. లక్షా 50వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.