Kodali Nani : దమ్ముంటే గుడివాడ, గన్నవరంలో పోటీ చేయాలి.. చంద్రబాబు, లోకేష్ కు కొడాలి నాని సవాల్

ఎన్టీఆర్ పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచేందుకు చంద్రబాబు సిద్ధమయ్యాడని విమర్శించారు.

Kodali Nani : దమ్ముంటే గుడివాడ, గన్నవరంలో పోటీ చేయాలి.. చంద్రబాబు, లోకేష్ కు కొడాలి నాని సవాల్

Kodali Nani

Updated On : May 28, 2023 / 3:09 PM IST

Kodali Nani challenge Chandrababu : చంద్రబాబు, టీడీపీ నేతలపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. స్క్రాప్ బ్యాచ్ అంతా రాజమండ్రిలో మహానాడు సభ పెట్టుకున్నారని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ కు దమ్ముంటే గుడివాడ, గన్నవరంలో పోటీ చేయాలని కొడాలి నాని సవాల్ విసిరారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు.

ఎన్టీఆర్ పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచేందుకు చంద్రబాబు సిద్ధమయ్యాడని విమర్శించారు. ఎన్టీఆర్ ఉంటే పార్టీ, రాష్ట్రం నాశనం అవుతుందన్న చంద్రబాబు.. గతిలేక, రాజకీయంగా బతకడానికి తిరిగి ఎన్టీఆర్ పేరు వాడుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఆకర్షణీయమైన మేనిఫెస్టో పెట్టడానికి రాజకీయాలంటే బట్టల వ్యాపారమా? అని ప్రశ్నించారు.

Chittoor District: పుంగనూరులో ఉద్రిక్తత.. రామచంద్ర యాదవ్ ఇంటి వద్ద పోలీస్ పహారా..

చంద్రబాబు కుక్క బతుక్కి 2024 ఎన్నికల్లో చెప్పు దెబ్బ తప్పదని ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు ఆకర్షణీయమైన అబద్ధాలు, వెన్నుపోట్లు ప్రజలందరికీ తెలుసన్నారు. చంద్రబాబు, లోకేష్ ను తన్ని తరిమి కొట్టి, ఎన్టీఆర్ వారసులు టీడీపీని స్వాధీనం చేసుకుంటారని పేర్కొన్నారు. దేశమంతా తిరిగినా చంద్రబాబు లాంటి నీచ రాజకీయ నాయకుడు మరొకరు ఉండరని తీవ్రంగా విమర్శించారు.